Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం..ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించడంతో 100 శాతం పోలింగ్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం..ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

Polling

presidential election : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కాసేపట్లో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇటు హైదరాబాద్‌ అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటు వేస్తున్నారు. NDA అభ్యర్థి ముర్ముకు ఏపీలో క్లీన్‌స్వీప్‌ చేయనున్నారు. ముర్ముకే వైసీపీ, టీడీపీ జైకొట్టాయి. దీంతో ఏపీ నుంచి అన్ని ఓట్లు ద్రౌపది ముర్ముకే రావడం కన్ఫామ్‌గా కనిపిస్తోంది. ఇటు UPA అభ్యర్థి సిన్హాకు టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చింది.

రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించడంతో 100 శాతం పోలింగ్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రధాని మోదీ సహా ఎంపీలంతా ఢిల్లీలోనే ఓటేయనున్నారు.

Jagdeep Dhankar : నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్ దాఖలు

పార్లమెంట్‌, అసెంబ్లీల్లోని నామినేటెడ్ సభ్యులకు, ఎమ్మెల్సీల‌‌కు ఓటు హ‌‌క్కు ఉండ‌‌దు. మొత్తం ఓటర్లు 4,809 మంది ఉండగా.. ఇందులో ఉభయ సభల ఎంపీలు 776 మంది, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు 4 వేల 33 మంది. మొత్తం ఓట్ల విలువ 10 లక్షల 86 వేల 431. ఇందులో ఎంపీల ఓట్ల విలువ 5 లక్షల 43 వేల 200. ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5 లక్షల43 వేల231. ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్‌ పాటించాలి. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్‌ చేయాలి. ఓటింగ్ మార్క్‌ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్‌ ఇస్తుంది. దాంతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.

ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 లక్కల ప్రకారం జనాభా, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకుని ఈ విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యతో డివైడ్‌ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో మల్టిప్లై చేసి ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు. ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతుంది. యూపీకి 208గా ఉండగా.. ఝార్ఖండ్, తమిళనాడులో 176, మహారాష్ట్రలో 175, తెలంగాణలో 132గా ఉంది. ఇక ఎంపీలకు సంబంధించి.. దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్య 776తో డివైడ్‌ చేస్తారు. ఈ మేరకు ఈ సారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు.