Vice Presidential Election: నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ .. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం.. సాయంత్రంకు ఫలితాలు

నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. పార్లమెంట్ హౌస్ లో శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Vice Presidential Election: నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ .. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం.. సాయంత్రంకు ఫలితాలు

Vice Presidential Election: నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. పార్లమెంట్ హౌస్ లో శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ క్రమంలో నూతన ఉప రాష్ట్రపతి ఎంపిక ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో ఎన్డీయే (NDA) అభ్యర్థిగా మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ బరిలో ఉన్నారు. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా బరిలో నిలిచారు.

Vice Presidential Polls: విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు టీఎమ్‌సీ దూరం

ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఆ తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించనున్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. నామినేటెడ్ సభ్యులకి కూడా ఓటు హక్కుంది. ఉభయ సభల్లో ప్రస్తుత సభ్యుల సంఖ్య 788 మంది ఉన్నారు. గెలవడానికి 390 కంటే ఎక్కువ ఓట్లు అవసరం. ఇదిలాఉంటే శనివారం రాత్రి సమయంలో ఫలితాలు వెలవడనున్నాయి. ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేస్తారు.

vice president polls: విప‌క్ష పార్టీల ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా

జగదీప్ ధన్‌కర్‌ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 515 ఓట్లు వస్తాయని అంచనా. మరోవైపు విపక్షాల అభ్యర్థి ఆల్వాకు ఇప్పటి వరకు వచ్చిన పార్టీల మద్దతును పరిశీలిస్తే దాదాపు 200 ఓట్లు రాబట్టవచ్చని అంచనా. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉంది.