ఎయిర్ పోల్యూషన్ వల్ల భారత్ లో గతేడాది 16లక్షల మంది మృతి

ఎయిర్ పోల్యూషన్ వల్ల భారత్ లో గతేడాది 16లక్షల మంది మృతి

Pollution deaths in India Lancent 2019లో ఎయిర్ పొల్యూషన్ కారణంగా 16లక్షల 70వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు “ది లాన్సెంట్” ఓ రిపోర్ట్ లో పేర్కొంది. 2017 కన్నా 2019లోనే ఎక్కువమంది విషపూరిత గాలి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అధికంగా పొల్యూషన్ ఉన్న సిటీల లిస్ట్ లో.. ఆర్థికంగా అదేవిధంగా జనాభా పరంగా పెరుగుతున్న భారత్ లోని పలు నగరాలు ఉన్న విషయం తెలిసిందే.

గాలి కాలుష్యంగా 2017లో 12లక్షల 40వేల మంది మరణించారని లాన్సెంట్ తన రిపోర్ట్ లో పేర్కొంది. 2017 కన్నా 2018లోనే పొల్యూషన్ కారణంగా నమోదైన మరణాలు ఎక్కువ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్.. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి,శ్వాసకోస ఇన్ఫెక్షన్లు,లంగ్ క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధులు,స్ట్రోక్,డయాబెటిస్ వంటి రోగాలకు దారితీస్తున్నట్లు ఈ స్టడీ తన విశ్లేషణలో పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా పేరుపొందిన ఢిల్లీలో ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే విపరీతమైన గాలి కాలుష్యం ఉంటుందని,ఇది ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని లాన్సెంట్ రిపోర్ట్ తెలిపింది. 2019లో నమోదైన పొల్యూషన్ మరణాలు కారణంగా 36.8బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని..భారత స్థూల దేశీయ ఉత్పత్తి(GDP)లో 1.36శాతం అని పేర్కొంది. ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ట్రాలు అధికంగా తమ జీడీపీలో నష్టాన్ని చవిచూస్తున్నాయని పేర్కొంది.

అయితే, గృహ వాయు కాలుష్యం కారణంగా 1990 నుంచి 2019నాటికి మరణాల రేటు 64.2శాతం పడిపోయినప్పటికీ అది.. పరిసర కణ పదార్థ కాలుష్యం రెట్టింపు కంటే ఎక్కువ అని లాన్సెంట్ తెలిపింది. కాగా, కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గాలి నాణ్యత మెరుగుపడిందని…అయితే నిబంధనల సడలింపుతో మళ్లీ పొల్యూషన్ పెరుగుతోందని తెలిపింది.