ఒక్క మాస్కే ఉంది..నా ప్రాణం పోయినా ఫర్వాలేదు..నా కుక్క బతకాలే

ఒక్క మాస్కే ఉంది..నా ప్రాణం పోయినా ఫర్వాలేదు..నా కుక్క బతకాలే

Poor Man Putting His Only Mask On His Dog 

poor Man Putting His Only Mask On His Dog  : అతనో నిరుపేద.బతకటమే కష్టమైన ఈ కరోనా కాలంలో మాస్క్ కూడా కొనుక్కోలేని పేదరికం. మాస్కు పెట్టుకోవాలి. లేకపోతే కరోనా సోకుతుంది..కాబట్టి అందరూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని రూల్. కానీ ఆ నిరుపేదకు ఓ కుక్క ఉంది. దాన్ని కన్నబిడ్డకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. వారిద్దరు బతకటమే కష్టంగా ఉన్న ఈ కరోనా కాలపు కష్టంలో ఆ నిరుపేద వద్ద ఉన్నది ఒక్కటంటే ఒకే ఒక్క మాస్క్.

మరి మాస్క్ అతను పెట్టుకోవాలా? కుక్కకు పెట్టాలా? అని ఆలోచిస్తే కూటికి నిరుపేద అయినా గుణానికి రాజులాంటి అతను ఏం చేసిన పని నెటిజన్లును ఆకట్టుకుంటోంది. తన దగ్గర ఉన్న ఒక్క మాస్కును తన బిడ్డలాంటి కుక్కకే పెట్టాడు. ‘‘నా ప్రాణం పోయినా పర్లేదు..నా బిడ్డలాంటి నాకుక్క బతకాలి’’ అంటున్నాడు. కుక్కకు మాస్క్ పెట్టి తాను మాస్కు లేకుండా తిరుగుతున్న ఓ నిరుపేదకు సంబంధించిన ఫోటోలు..వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ‘నువ్వు దేవుడివి సామీ’అంటూ ప్రశంసిస్తున్నారు.

నిరుపేదలా క‌నిపించే ఒక వ్యక్తి త‌న ద‌గ్గరున్న ఒకే ఒక మాస్క్‌ను తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కుక్క‌కు పెట్టాడు. ప్ర‌పంచ‌మంతా ప‌ట్టించుకోక‌పోయినా ఈ కుక్క మాత్రం త‌న క‌ష్టాల్లో, సంతోషాల్లో తోడుగా ఉండి తనను విడిచిపెట్టని కుక్క పట్ల ఎంతో ప్రేమను చూపించాడు. క‌రోనా భ‌యంతో ఎవరికి వారు త‌మ ప్రాణాల‌కు ముప్పు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంటే ఇత‌ను మాత్రం త‌న ప్రాణం పోయినా ఫ‌ర్వాలేదు నా కుక్క బ‌తికుండాల‌ని కోరుకుంటున్నాడు. త‌న కుక్క‌ను భుజానికెత్తుకొని రోడ్డు వెంట న‌డుస్తున్న ఒక వ్య‌క్తి ఈ వీడియోలో స్పెషల్ ఎట్రాక్షన్ అయిపోయాడు.

ముఖానికి మాస్క్ వేసుకున్న శున‌కాలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవ్వ‌డం ఇదే మొద‌టిసారి కాక‌పోవ‌చ్చు. కానీ రెండో విడ‌త క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ర‌ణ‌ మృదంగం మోగిస్తున్న వేళ..తన దగ్గర ఉన్న ఒకే ఒక్క మాస్కును తన కుక్కకు పెట్టి..దాన్ని భుజం మీద మోసుకుంటూ.. తాను మాస్కు లేకుండా తిరుగుతున్న ఈ నిరుపేద వీడియో హృద‌యాన్ని క‌దిలిస్తోంది. కుక్క‌కి మాస్క్ వేసి, నువ్వెందుకు వేసుకోలేద‌ని అడిగితే..`ఇది నా బిడ్డ‌. నాకు ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు..నా ప్రాణం పోయినా పర్లేదు.. గానీ దీనికి మాత్ర‌ం ఏం కాకూడదు..`నేను చ‌చ్చిపోయినా, నా కుక్కను మాత్రం చ‌చ్చిపోనివ్వ‌ను` అంటున్నాడు.