Porcupine Security: మేముండగా మీకేం కాదు బిడ్డా..! చిరుత నుండి జెడ్ సెక్యూరిటీతో బిడ్డలను కాపాడుకున్న పోర్కుపైన్ జంట.. వీడియో వైరల్..

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి సుప్రియా సాహు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోలను పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆమె మరో ఆసక్తికర వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో పోర్కుపైన్ (పందికొక్కు) జంట తమ బిడ్డలను చిరుత నుంచి కాపాడుకొనేందుకు జెడ్ క్యూరిటీని తలపించేలా రక్షణ కల్పించాయి. ఫలితంగా చిరుతకు చెమటలు పట్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Porcupine Security: మేముండగా మీకేం కాదు బిడ్డా..! చిరుత నుండి జెడ్ సెక్యూరిటీతో బిడ్డలను కాపాడుకున్న పోర్కుపైన్ జంట.. వీడియో వైరల్..

Porcupine Security

Porcupine Security: ఎలాంటి జంతువైనా తమ పిల్లల జోలికొస్తే కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగిస్తాయి. ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా పందికొక్కుల జంట (Porcupine parents) తమ పిల్లలను చిరుత పులినుంచి కాపాడుకొనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. పోర్కుపైన్ జంట తమ బిడ్డలను రోడ్డుదాటిస్తున్న సమయంలో పులి వెంబడించింది. పులి నుంచి వాటిని కాపాడుకొనేందుకు జెడ్ సెక్యూరిటీని తలపించేలా రక్షణ కల్పిస్తూ ఆ జంట పులితో పోరాడిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Viral Video: ఖతర్‌లో ఫిఫా ప్రపంచకప్.. కేరళలో రోడ్డుపై కొట్టుకున్న బ్రెజిల్, అర్జెంటీనా ఫ్యాన్స్

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి సుప్రియా సాహు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోలను పోస్టు చేస్తుంటారు. జంతువులు, వాటి జీవన విధానంతో పాటు అవి క్రూర జంతువుల నుంచి రక్షించుకొనే తీరును వీడియోల ద్వారా ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆమె పోస్టు చేసిన వీడియోలో పోర్కుపైన్ జంట తమ బిడ్డలను చిరుత నుంచి రక్షించుకొనేందుకు జెడ్ సక్యూరిటీని తలపించేలా రక్షణ కల్పించాయి. ఫలితంగా చిరుతకు ముచ్చెమటలు పట్టించాయి.

 

 

ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 3.85లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఆరు వేలకుపైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియోకు సుప్రియా సాహు క్యాప్షన్ ఇలా రాశారు.. పోర్కుపైన్ తల్లిదండ్రులు తమ బిడ్డలకు చిరుత పులి నుండి జెడ్ క్లాస్ రక్షణను అందించాయి. ధైర్యంగా పోరాడాయి. చిరుతపలి తమ బిడ్డలను తాకడానికి చేసే అన్ని ప్రయత్నాలను అవి అడ్డుకున్నాయి అని రాసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పోర్కుపైన్ జంట పోరాటాన్ని కొనియాడుతూ రీ ట్వీట్లు చేస్తున్నారు.