Maha cabinet portfolio: మహా మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖంటే?

మొత్తం 20 మందితో కూడిన కేబినెట్‭లో దాదాపుగా అందరికీ శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ శాఖలు ఉండగా.. మిగతా వారికి తమ ప్రాధాన్యాన్ని బట్టి కేటాయించారు. ఆగస్టు 9న మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా 18 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తొమ్మిది మంది బీజేపీకి చెందినవారు కాగా, మరో తొమ్మిది మంది రెబెల్ శివసేనకు చెందిన వారు. మంత్రివర్గ కూర్పుపై విమర్శలు రాకుండా ఫడ్నవీస్-షిండే సమతూకం పాటించారు.

Portfolios allocated to Maharashtra ministers

Maha cabinet portfolio: అనేక విమర్శలు, అనేక ఒడిదుడుకులు దాటుకుని మంత్రి వర్గాన్ని విస్తరించింది మహా ప్రభుత్వం. అయితే విస్తరణ జరిగింది కానీ, శాఖల కేటాయింపు జరగలేదు. దీంతో మళ్లీ ప్రభుత్వంపై విమర్శలు లేవనెత్తాయి. ఈ విమర్శలను సైతం దాటుకుని ఎట్టకేలకు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ షిండే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం మంత్రులకు కేటాయించిన శాఖల తాలూకు జాబితాను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి షిండే వద్ద ఐడీ, అర్బన్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ వంటి శాఖలు ఉండగా.. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‭కు హోంశాఖ సహా ఆర్థిక, న్యా, నీటి పారుదల శాఖలు కేటాయించారు.