Navjot Singh Sidhu : పదవి ఉన్నా, లేకున్నా.. రాహుల్, ప్రియాంక వెన్నంటే ఉంటా

ఇటీవల అనూహ్యరీతిలో పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారా? ఆయన తీరు చూస్తుంటే ఈ అనుమానం కలగక మానదు. తాజాగా సిద్ధూ ఆసక్తి

Navjot Singh Sidhu : పదవి ఉన్నా, లేకున్నా.. రాహుల్, ప్రియాంక వెన్నంటే ఉంటా

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu : ఇటీవల అనూహ్యరీతిలో పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారా? ఆయన తీరు చూస్తుంటే ఈ అనుమానం కలగక మానదు. తాజాగా సిద్ధూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై తన విధేయత తెలిపేలా మాట్లాడారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళతానని చెప్పారు. అంతేకాదు, తాను పదవిలో ఉన్నా, లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు.

“ప్రతికూల శక్తులన్నీ ఏకమై నన్ను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి. కానీ పాజిటివ్ ఎనర్జీలోని ప్రతి అణువు ఉప్పొంగి పంజాబ్ ను గెలిపిస్తుంది, పంజాబీయాత్ (విశ్వ సోదరభావం)ను నిలుపుతుంది, ప్రతి పంజాబీని విజయం వరిస్తుంది” అంటూ సిద్ధూ ట్వీట్ చేశారు.

ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!

ఇటీవల కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, కాంగ్రెస్ హైకమాండ్ చరణ్ జిత్ చన్నీని సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత సిద్ధూ పీసీసీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే, నిన్న సిద్ధూ సీఎం చరణ్ జిత్ చన్నీతో భేటీ అయిన తర్వాత సమస్య పరిష్కారం అయినట్టు భావిస్తున్నారు. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలుస్తోంది.

సిద్దూ లేవనెత్తిన చాలా డిమాండ్లకు సీఎం చన్నీ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధూ కాస్త వెనక్కు తగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 4న జరిగే పంజాబ్‌ కేబినెట్‌ సమావేశం తర్వాత సిద్దూ డిమాండ్లపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను పదవులను నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

సిద్దూ డిమాండ్లకు అనుగుణంగా పంజాబ్‌ డీజీపీతో పాటు ఆ రాష్ట్ర ప్రస్తుత అడ్వొకేట్‌ జనరల్‌ను కూడా మార్చే అవకాశాలున్నాయి. పంజాబ్ పోలీసు చీఫ్‌గా ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాను తొలగించవచ్చు. ఆయన 2015 లో జరిగిన ఘటనకు సంబంధించి అకాలీదళ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అధిపతిగా ఉన్నారు. అంతేకాదు గురు గ్రంథ్ సాహిబ్‌ను అవమానించడాన్ని నిరసిస్తున్న వారిపై పోలీసు కాల్పుల ఘటనకు ప్రధాన కారకుడని సిద్ధూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను తొలగించాలని సిద్ధూ పట్టుబడతున్నారు. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కూడా పదవుల నుంచి తొలగిస్తారా? లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

పంజాబ్‌ రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపర్చడం, మార్పును తీసుకురావడమే తన ఆశయం, బాధ్యత అని సిద్ధూ అన్నారు. ఇదే తన ధర్మమని తెలిపారు. ఎవరిపైనా తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. తాను ఎవరితోనూ వ్యక్తిగతంగా పోరాడడం లేదని వెల్లడించారు. కేవలం పంజాబ్‌ అనుకూల ఎజెండా కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే దీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్నానని వివరించారు.