Poster War In Rajasthan: రాజస్థాన్‌లోకి భారత్ జోడో యాత్ర.. పైలట్, గెహ్లాట్ వర్గీయుల మధ్య పోస్టర్ వార్..

మరికొద్ది గంటల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు సచిన్ పైలట్ వర్గీయులు ఝలావర్ జిల్లాలో పోస్టర్‌లు వేయించారు. అయితే, ఆ పోస్టర్లపైనే రాజస్థాన్ పీసీసీ చీఫ్ తన పేరుతో ముద్రించిన పోస్టర్లను వేశారు. దీంతో సచిన్ వర్గీయులు ఆందోళనకు దిగారు.

Poster War In Rajasthan: రాజస్థాన్‌లోకి భారత్ జోడో యాత్ర.. పైలట్, గెహ్లాట్ వర్గీయుల మధ్య పోస్టర్ వార్..

Rahul Bharat jodo Yatra

Poster War In Rajasthan:రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎంగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారత్ జోడో యాత్ర విజయవంతం అవుతుందా అనే సందేహాలు ఆ పార్టీ అగ్రనేతలను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి కారణం.. ఆ పార్టీ కాంగ్రెస్ రెండు వర్గాలు విడిపోవటమే. సచిన్ పైలట్ వర్సెస్ అశోక్ గెహ్లాట్ వర్గాల మధ్య నిత్యం పోరుసాగుతూనే ఉంటుంది. మరికొద్ది గంటల్లో భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో మరోసారి గెహ్లాట్, పైలట్ వర్గీయుల మధ్య వివాదం రాజుకుంది.

Rajasthan Congress crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి నాటకీయత లేదు.. ఒకటి రెండు రోజుల్లో సమస్య సమసిపోతుందన్న కేసీ వేణుగోపాల్

మరికొద్ది గంటల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు సచిన్ పైలట్ వర్గీయులు ఝలావర్ జిల్లాలో పోస్టర్‌లు వేయించారు. అయితే, ఆ పోస్టర్లపైనే రాజస్థాన్ పీసీసీ చీఫ్ తన పేరుతో ముద్రించిన పోస్టర్లను వేశారు. దీంతో సచిన్ వర్గీయులు ఆందోళనకు దిగారు. పోస్టుర్ల కోసం తాము ఎంతో ఖర్చుపెట్టి కీలక ప్రాంతాల్లోని హోర్డింగులను అద్దెకు తీసుకున్నామని, ఇప్పుడు తమ పోస్టర్లపై ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా పీసీసీ చీఫ్ పోస్టర్లు వేయడం ఏంటని పైలట్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నందుకు ప్రభుత్వ టీచర్‌ సస్పెన్షన్

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో పైలట్, గెహ్లాట్ వర్గీయుల మధ్య ఎప్పటినుంచో వర్గపోరు నడుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం నుంచి ఆ రాష్ట్రంలో కొనసాగనుంది. ఈ నేఫథ్యంలో యాత్రను విజయవంతం చేసేందుకు గతనెల 29న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాజస్థాన్ కు వెళ్లి గెహ్లాట్, సచిన్ మధ్య సయోధ్య కుదిర్చారు. ఇద్దరు నేతలతో కరచాలనం చేయించి రాష్ట్రంలో కాంగ్రెస్ ఐక్యంగా ఉందని చెప్పించారు. కానీ, రాహుల్ మరికొద్దిసేపట్లో రాజస్థాన్ లోకి ప్రవేశిస్తారన్న సమయంలో మరోసారి ఇరువర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. రాహుల్ పాదయాత్ర సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.