BR Ambedkar Posters: కాషాయ దుస్తుల్లో, నుదిటిపై బొట్లతో అంబేద్కర్ పోస్టర్లు.. ఉద్రిక్తత

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కాషాయ దుస్తుల్లో, నుదిటిపై అడ్డం బొట్లు పెట్టుకుని ఉన్నట్లు చూపిస్తూ పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. ఇవాళ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని నగరం కుంభకోణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ మక్కల్ కట్చి ఈ పోస్టర్లను గోడలకు అంటించినట్లు తెలుస్తోంది.

BR Ambedkar Posters: కాషాయ దుస్తుల్లో, నుదిటిపై బొట్లతో అంబేద్కర్ పోస్టర్లు.. ఉద్రిక్తత

BR Ambedkar Posters

BR Ambedkar Posters: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కాషాయ దుస్తుల్లో, నుదిటిపై అడ్డం బొట్లు పెట్టుకుని ఉన్నట్లు చూపిస్తూ పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. ఇవాళ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని నగరం కుంభకోణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ మక్కల్ కట్చి ఈ పోస్టర్లను గోడలకు అంటించినట్లు తెలుస్తోంది.

దీనిపై హిందూ మక్కల్ కట్చి వ్యవస్థాపకుడు అర్జున్ సంపత్ మాట్లాడుతూ… ‘‘అంబేద్కర్ జాతీయ నేత’’ అని అన్నారు. అంబేద్కర్ పోస్టర్లను ఈ విధంగా ముద్రించడంపై హిందూ మక్కల్ కట్చి పదాధికారి గురుమూర్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు ఆ పోస్టర్లను తొలగించాలని దళిత సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు.

గుర్తుమూర్తిని వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కుంభకోణం ప్రాంత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ముందు వారు ధర్నాకు దిగారు. గుర్తు మూర్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, మరియాల్ లోనూ అంబేద్కర్ వర్ధంతి వేళ ఉద్రిక్తత నెలకొంది.

అక్కడి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు వస్తున్న సమయంలో వారిని విదుతలై చిరుతైగల్ కట్చి సభ్యులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కారయకర్తలు రోడ్ రోకో చేశారు. ఇరు పార్టీల సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్