Controversial Posters : ఢిల్లీలో ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టర్ల కలకలం
ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో...దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

Posters
Controversial Posters : ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో…దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన 100 మందిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆరుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఉదతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం సృష్టించాయి. మోదీ హఠావో..దేశ్ బచావో అంటూ ఈ పోస్టర్లలోని సారాంశం.
ఢిల్లీ వ్యాప్తంగా లక్ష వరకు ఈ పోస్టర్లను అంటించాలని భావించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి వెనక ఉన్న కుట్రదారులు ఎవరు? ఈ పోస్టర్లు ఎక్కడ ఫ్రింట్ అయ్యాయి? అనే దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. మంగళవారం సుమారు 50 వేల పోస్టర్లను ఓ ట్రక్కులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయం ఉన్న దీన్ దయాల్ మార్గ్ లో ఈ పోస్టర్లను అగంతకులు అతికించారు.
Posters Against PM: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచారం చేశారని 12మంది అరెస్ట్
ఢిల్లీ వ్యాప్తంగా లక్ష పోస్టర్లను అంటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సుమారు వంద మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టర్లు లభించిన ట్రక్కు, అందులో ఉన్న వ్యక్తులను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.