కశ్మీర్ లో పోస్ట్ పెయిడ్ మెబైల్ సర్వీసుల పునరుద్దరణ

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2019 / 07:12 AM IST
కశ్మీర్ లో పోస్ట్ పెయిడ్ మెబైల్ సర్వీసుల పునరుద్దరణ

జమ్మూకశ్మీర్ లో మెబైల్ సేవలపై ఆంక్షలు ఎత్తివేశారు. 72 రోజుల తర్వాత ఇవాళ(అక్టోబర్-14,2019) కశ్మీర్ వ్యాలీలో పోస్ట్ పెయిడ్ మొబైల్(అన్నినెట్ వర్క్ లు) సర్వీసులు పునరుద్దరించబడ్డాయి. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్ లో మొబైల్,ఇంటర్నెట్,కమ్యూనికేషన్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నాం నుంచి దాదాపు 40లక్షల పోస్ట్ పెయిడ్ మెబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.10 జిల్లాల పరధిలోని పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు పనిచేయనున్నాయి.

ప్రస్తుతానికి కాల్ సర్వీసులపైనే ఆంక్షలు సడలించారు. అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీపై మాత్రం  ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు. త్వరలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో శాంతి భద్రతల దృష్యా కశ్మీర్ లో ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించింది. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్తగా అనేకమంది రాజకీయ నాయకులు,మాజీ సీఎంలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఫోన్ సేవలు,ఇంటర్నెట్ బంద్ చేశారు. అయితే క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. గత గురువారం నుంచి కశ్మీర్ లోకి పర్యాటకులను అనుమతిస్తూ కశ్మీర్ యంత్రాంగం  ఆదేశాలు జారీ చేసిన విషషయం తెలిసిందే.

అయితే ఇప్పటికీ  కశ్మీర్ వ్యాలీలో చాలా చోట్ల మెబైల్,ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ బ్లాక్ చేయబడే ఉన్నాయి. గత నెలలో ప్రభుత్వం కశ్మీర్ లో ల్యాండ్ లైన్ సేవలను పునరుద్దరించింది. అయితే ఇందులో ఇళ్లల్లో ఉపయోగిస్తున్న ప్రభుత్వ నిర్వహణలోని బీఎస్ఎన్ఎల్  కనెక్షన్ ఉన్న టెలిఫోన్లు ఎక్కువగా ఉన్నాయి.