పబ్లిక్ డిమాండ్ మేరకు దూరదర్శన్‌లో రామాయణం పునః ప్రసారం 

10TV Telugu News

దూరదర్శన్ ఛానల్ లో 30  ఏళ్ల క్రితం  ప్రసారమై దేశాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణ్ సీరియల్ ను దూరదర్శన్ మళ్లీ ఇన్నేళ్శకు  పునః ప్రసారం చేస్తోంది. 1987-88 మధ్య కాలంలో  ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్ సాగర్ దర్శకత్వంలో  రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లహరి, హనుమంతునిగా దారాసింగ్‌ తదితరులు నటించారు.

రాముడిగా నటించిన అరుణ్‌గోవిల్‌ అప్పట్లో ఎక్కడకు వెళ్లినా రాముడే వచ్చాడని ప్రజలు భారీ సంఖ్యలో ఆయన్ను చూసేందుకు వచ్చేవారు. తర్వాతి కాలంలో దీపికా చికిలియా  ఎంపీగా  గెలుపోందారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవటంతో  వారు బయటకురాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  అప్పట్లో రామాయణ్ సీరియల్ ప్రసారమయ్యే ఆదివారాల్లో రోడ్లపై జనం లేకుండా నిర్మానుష్యంగా ఉండేవి.  
 

హిందువులు ఎంతో  పవిత్రంగా భావించే రామాయణ గ్రంధానికి  దృశ్యరూపమిచ్చిన ఈ సీరియల్ ను మరో సారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈవిషయాన్నిట్విట్టర్ లో పోస్టు చేశారు.  శనివారం మార్చి28 నుంచి  ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు, మొదటి ఎపిసోడ్, రాత్రి 9 గంటలనుంచి 10 గంటల వరకు 2వ ఎపిసోడ్  నేషనల్  దూరదర్శన్ చానల్ లో  ప్రసారం కానుంది. 

See Also | 35 ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు ICMR నిర్ణయం