KCR National politics : టీఆర్ఎస్ జాతీయ బృందంపై కేసీఆర్ కసరత్తులు..కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్

టీఆర్ఎస్ జాతీయబృందంపై CM కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలో నటుడు..రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు

KCR National politics : టీఆర్ఎస్ జాతీయ బృందంపై కేసీఆర్ కసరత్తులు..కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్

KCR National politics Prakash raj : గులాబీ బాస్..తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు పలువురు సీఎంలతో భేటీ అవుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీపై నిప్పుమీద ఉప్పులా మండిపడిపోతున్న గులాబీ బాస్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. బీజేపీని దెబ్బ కొట్టాలని యోచనతో ఇప్పటికే పలువురు సీఎంలు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఫోన్ చేశారు. మమతా త్వరంలో హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ తో భేటీకానున్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు.దేశ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటు కోసం గులాబీ బాస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో.. ప్ర‌ముఖ సినీ న‌టుడు, పొలిటిక‌ల్ లీడ‌ర్ ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని సంకేతాలు అందిస్తున్నారు.

Also read : CM KCR: మహా సీఎంతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యేక ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా రాజ‌కీయాలు క‌దులుతున్నాయి. దీని కోసం ఇప్ప‌టికే కాంగ్రెస్ ను కాద‌ని మ‌రో ప్ర‌తిప‌క్ష కూటమిని ఏర్పాటు చేసే దిశ‌గా దీదీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు కేసీఆర్ సైతం బీజేపీకి వ్య‌తిరేకంగా ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌ను ఏకం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే దేశంలోని బీజేపీయేత‌ర ప‌లువురు సీఎంల‌తో భేటీ అయ్యారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఏర్పాటు లో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించ‌నున్నార‌ని తెలుస్తోంది. అసలే బీజేపీ అంటే మండిపడే ప్రకాశ్ రాజ్ కు జాతీయ బాధ్యతల్లో టీఆర్ఎస్ తరపున కీలక పాత్ర పోషలించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి సంకేతాలు అందిస్తున్నారు. దీంట్లో భాగంగానే ముంబైలో సీఎం ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్‌తో కేసీఆర్ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆయ‌నవెంట ప్ర‌కాశ్ రాజ్ కూడా ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ కావ‌డంతో పాటు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేపింది.

Also read : KCR Maharashtra Tour Live Updates: మార్పు రావాలి.. కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్‌మీట్

తెలుగుతో పాటు ఇతర దక్షిణ భారత చిత్రాలలో నటిస్తున్న ప్రకాష్ రాజ్.. బీజేపీ వ్య‌తిరేక భావసారూప్యత కలిగిన ప్రాంతీయ, జాతీయ పార్టీల ఫ్రంట్‌ను ఏర్పరచడానికి కేసీఆర్ బృందంలో కీలక సభ్యుడిగా మారనున్నట్లుగా తెలుస్తోంది. ప్ర‌కాశ్ రాజ్ బీజేపీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తారనే విషయం తెలిసిందే. శతృవుకి శతృవు మిత్రుడు అన్నట్లుగా ప్రకాశ్ రాజ్ ఈ జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యత పోషించనున్నట్లుగా తెలుస్తోంది. ప‌లుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు సైతం గుప్పించిన ప్రకాశ్ రాజ్ మంచి వక్త..పలు అంశాలపై చక్కటి పట్టు ఉన్న వ్యక్తికూడా. ఇదే స‌మ‌యంలో ఆయ‌న కేసీఆర్ చేస్తున్న ప‌నుల‌ను పొగ‌డ‌టంతో పాటు స్వ‌యంగా ఆయ‌న అభిమానిని అనే అభిప్రాయం వ్య‌క్తప‌రిచిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌కాశ్ రాజ్ తన సొంత రాష్ట్రం కర్నాటకతో పాటు తమిళనాడు నాయకులతో మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో కేసీఆర్ ప్రకాశ్ రాజ్ సేవలను వివిధ పార్టీలను క‌లుపుకుని పోవ‌డం కోసం ఉప‌యోగించుకోవాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశ్ రాజ్.. సీఎం కేసీఆర్ బీజేపీ వ్య‌తిరేక కూట‌మి రాజ‌కీయ చ‌ర్చ‌ల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Also read : KCR – Uddhav: నేడు మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

2018లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ప్రకాశ్ రాజ్ కేసీఆర్‌ కలిసి కనిపించారు. కానీ ఆ తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలు..థర్డ్ ఫ్రంట్ అనే మాటల్ని మర్చిపోయినట్లుగా కనిపించారు. తాజాగా బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు చేయటంతో మరోసారి బీజేపీపై మండిపడుతున్న గులాబీ బాస్ మరోసారి జాతీయ రాజకీయాలు అంటూ హడావిడి టూర్లు చేస్తున్నారు. కేసీఆర్ కు తోడుగా ప్రకాశ్ రాజ్ కూడా జత కలిస్తే..ఇటు చణుకులు..అటు చాణక్య వ్యూహాలు ఇక ఖాయం అన్నట్లుగా ఉంటుందంటున్నారు పలువురు.

గతంలో బెంగళూరులో మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడను కేసీఆర్ కలిసినప్పుడు ప్రకాష్ రాజ్ అక్కడే ఉన్నారు. ఏప్రిల్ 2018లో జరిగిన ఈ సమావేశానికి కొన్ని రోజుల ముందు.. ప్ర‌కాశ్ రాజ్.. టీఆర్ఎస్ అధినేత‌తో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల కొత్త ఫ్రంట్‌ను ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను గురించి చర్చించారు.

Read Also : ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్.. స్పెషల్ అట్రాక్షన్ ప్రకాష్ రాజ్

ఇక ప్రకాష్ రాజ్ 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యున్నత సంస్థ అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓడారు. ఇది లోకల్ సెంటిమెంట్ కావచ్చు. లేదా సిని రాజకీయాలు కూడా కావచ్చు. ఏది ఏమైనా ప్రకాశ్ రాజ్ మా ఓటమి పెద్ద విషయం కాదు. లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వంపై తనకు గట్టి నమ్మకం ఉందని చెప్పుకునే ప్రకాష్ రాజ్, 2014 నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పుడు గులాబీ బాస్ జాతీయ రాజకీయాల్లో బిజిబిజీగా భేటీలు జరుగుతున్న క్రమంలో మరోసారి ప్ర‌కాశ్ రాజ్‌ కేసీఆర్ కనిపించినచోటల్లా కనిపిస్తున్నారు. ఈక్రమంలో టీఆర్ఎస్ రాజ్యస‌భ‌కు పంప‌బోతున్న‌ద‌ని ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. దీంట్లో ఎంత వరకు నిజమో వేచి చూడాలి..గులాబీ బాస్‌-ప్ర‌కాశ్‌రాజ్‌ల బంధం ఎటువైపు సాగుతుందో..సాగనుందో..! లేదా గతంలాగానే మరోసారి సల్లబడనుందో వేచి చూడాలి..