గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ  నేత  ప్రమోద్‌ సావంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 05:31 AM IST
గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ  నేత  ప్రమోద్‌ సావంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

పనాజీ: గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ  నేత  ప్రమోద్‌ సావంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం 1.51 గంటలకు గవర్నర్ మృదులా సిన్హా రాజ్‌భవన్‌లో  ప్రమోద్ సావంత్ తో ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎం లుగా రామకృష్ణ ధవలీకర్, విజయ్ సర్దేశాయ్ కూడా ప్రమాణం చేశారు. అలాగే పారికర్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న 11 మంది సావంత్‌తో పాటు మరోసారి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణస్వీకారంతో సావంత్‌ గోవాకు  13వ ముఖ్యమంత్రి అయ్యారు. 
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

పారికర్‌ వారసుడిని ఎంపిక చేసే విషయంలో మిత్రపక్షాల మధ్య ఆదివారం మార్చి 17వ తేదీ  రాత్రి నుంచి బీజేపీ అధిష్టానం  విస్తృతస్థాయిలో చర్చలు సాగించాయి. చివరకు గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ అభ్యర్థిత్వం వైపు వారంతా మొగ్గుచూపారు. జీఎఫ్‌పీ అధినేత విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ నేత రామకృష్ణ ధవలీకర్ డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టేందుకు అంగీకారం కుదిరింది.
Read Also : ఆయుర్వేద డాక్టర్ టు సీఎం: ప్రమోద్ సావంత్ ప్రస్థానం