బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీకి కరోనా

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 01:37 PM IST
బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీకి కరోనా

కరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని నేతలు, సెలబ్రెటీ, ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు.



భారత రత్న, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. నార్మల్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు, కరోనా పరీక్షలు చేయగా…నెగటివ్ అని వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేశారు. కరోనా వైరస్ భారతదేశంలో 22 లక్షల మందిని ప్రభావితం చేసింది.



దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62 వేల 064 కరోనా పాజిటివ్ కేసుు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ప్రస్తుతం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

24 గంటల్లో వేయి 007 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య..44 వేల 386 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 6 లక్షల 34 వేల 945 యాక్టివ్ కేసులున్నాయి.