JDU లో ముసలం : ప్రచార బాధ్యతల నుండి వైదొలిగిన ప్రశాంత్ కిశోర్

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 01:33 AM IST
JDU లో ముసలం : ప్రచార బాధ్యతల నుండి వైదొలిగిన ప్రశాంత్ కిశోర్

మరో రెండు వారాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో JDU (జనతాదళ్ – యునైటెడ్)లో ముసలం పుట్టింది. ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ‘ప్రశాంత్ కిశోర్’ నిర్వాహణ, ప్రచార బాధ్యతల నుండి వైదొలిగారు. ఈ మేరకు మార్చి 29వ తేదీ శుక్రవారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. జేడీయూ నేత రాజ్యసభ సభ్యుడు రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఈ బాధ్యతలను చూస్తారని ఆయన వెల్లడించారు. ఆయన ఎందుకు వైదొలిగారనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. 

2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి నుండి ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు ఉంది ఇతనికి. అనంతరం పలు పార్టీలకు ఈయన వ్యూహకర్తగా పనిచేశారు. జేడీయూ నుండి బయటకు వచ్చేయడం అక్కడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ జీవితం ప్రారంభించిన తాను ప్రస్తుతం నేర్చుకోవడానికి..సహకరించడానికే పరిమితమౌతానంటూ ట్విట్టర్‌లో ప్రశాంత్..తెలిపారు.

ఆయన మనస్థాపం చెందడానికి కారణం పార్టీ నేతలే అని ప్రచారం జరుగుతోంది. బీహార్‌లోని మహాకూటమి నుండి సీఎం నితీష్ వైదొలిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు..మహాకూటమి నుండి బయటకు వచ్చిన తరువాత ప్రజాతీర్పును వెళితే బాగుండేదని ఇటీవలే ప్రశాంత్ వ్యాఖ్యానించారు. దీనిపై జేడీఎస్‌లో దుమారం రేగింది. జేడీఎస్‌లోకి ప్రశాంత్ ఎలా వచ్చారో గుర్తు చేసుకోవాలని కొంతమంది నేతలు వ్యాఖ్యానించారు. మరి ప్రశాంత్ నెక్ట్స్ స్టెప్ ఎటువైపో చూడాలి.