Punjab Election : కాంగ్రెస్ కోసం రంగంలోకి పీకే..సంకేతాలిచ్చిన సీఎం

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎలాగైనా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త

Punjab Election : కాంగ్రెస్ కోసం రంగంలోకి పీకే..సంకేతాలిచ్చిన సీఎం

Pk

Prasanth Kishore  వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎలాగైనా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ నిర్ణయించింది.

ప్ర‌శాంత్ కిషోర్ టీం పార్టీకి స‌హ‌క‌రిస్తార‌ని పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంకేతాలిచ్చారు. గ‌తంలో ప‌లు పార్టీల ఎన్నిక‌ల ప్ర‌చారాల‌కు ప‌దును పెట్టిన ప్ర‌శాంత్ కిషోర్‌ తో కాంగ్రెస్ వ్యూహాల‌ను పంచుకోవాల‌ని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ హ‌రీష్ చౌద‌రి ఇటీవ‌ల త‌న‌తో చెప్పార‌ని సీఎం చన్నీ తెలిపారు.

మ‌రోవైపు,కాంగ్రెస్ కు రాజీనామా చేసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన మాజీ సీఎం, కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ బీజేపీతో చేతులు క‌లిపి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. అమరీందర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఇప్పటికే బీజేపీ యాక్సెప్ట్ చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ కొత్త పార్టీతో పంజాబ్ పాలిటిక్స్ ఆశక్తికరంగా మారనున్నాయి.

ALSO READ Rahul Dravid: టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ఫస్ట్ సిరీస్ ఆ జట్టుతోనే!