సీఎం సీటే లక్ష్యం : కమల్‌ కోసం ప్రశాంత్ కిశోర్ బృందం 500 వ్యూహం

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 02:50 AM IST
సీఎం సీటే లక్ష్యం : కమల్‌ కోసం ప్రశాంత్ కిశోర్ బృందం 500 వ్యూహం

సీఎం సీటే లక్ష్యంగా సిటీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్ పావులు కదుపుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆపరేషన్‌ 500 వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ బృందం కమల్‌కు అందజేసింది. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని పనులను 500 రోజుల్లోపు పూర్తి చేసి, శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావడమే దీని లక్ష్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కమల్ పార్టీ ఫోకస్ పెట్టబోతోంది.

ఏపీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు దాగి ఉన్నాయి. దీంతో తమ పార్టీకి కూడా పనిచేయాలని ఎంతో మంది కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీతో ప్రశాంత్..ఒప్పందం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పళని స్వామి కూడా తన వ్యూహకర్తగా ఆయన్ను నియమించుకోవాలని ఆలోచన చేసినట్లు టాక్. అయితే..తమిళనాడులో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌ను ప్రశాంత్ కిశోర్ కలవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఎన్ఎమ్ పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ బృందం పనిచేస్తోందని తెలుస్తోంది.