PK To Join Congress : కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిషోర్!

కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

PK To Join Congress : కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిషోర్!

Pk

PK To Join Congress కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా రాహుల్ గాంధీ నివాసంలో.. గాంధీ కుటుంబంతో సమావేవమయ్యారు. సోనియాతో పాటుగా రాహుల్ , ప్రియాంకతో ఒకే సమయంలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నేరుగా సోనియా నుండి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ కు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు..హోదా ఇస్తామంటూ ప్రశాంత్ కిషోర్ కు ఆఫర్ ఇచ్చారు.

అయితే గాంధీల ఆహ్వానంపై ప్రశాంత్ కిషోర్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా..నో అని మాత్రం చెప్పలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్,ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు రాబోయే జాతీయ ఎన్నికల గురించి ప్ర‌శాంత్ కిశోర్‌.. గాంధీల‌తో చ‌ర్చించిన‌ట్లు భావించినా అంత‌కంటే పెద్ద‌దే ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పటం ద్వారా ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తాను రాజకీయ వ్యూహకర్త గా పని చేయటం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో జేడీయూలో ఉపాధ్యక్షుడిగా పని చేసి ఉద్వాసనకు గురైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజకీయంగా ఒక లక్ష్యం,కసితో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఏ విధంగా అయినా బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాకుండా పని చేసేందుకు అన్ని అవకాశాలను,తన శక్తిని,సమర్దతను వినియోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు గాంధీ కుటుంబాన్ని ఆకర్షించింది. వారి చర్చల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంశాలు,వ్యూహాలతో పాటుగా కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్లాలో పీకే సూచించినట్లు తెలుస్తోంది. దీంతోఇక ప్రశాంత్ కిషోర్ జాతీయ పార్టీని ఢీ కొనేందుకు మరో జాతీయ పార్టీలో చేరి ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.

ఇక,2024 ఎన్నికల్లో బీజేపీ ని ఓడించటమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్… ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వంలో బీజేపీయేతర పార్టీల నేతలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారంతా ఇప్పడు ఒక విధంగా పీకే మార్గదర్శకంలో పని చేస్తున్నారు. ఇటీవల శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఢీకొట్టడం అసాధ్యం అని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.