Prashant Kishor: బీజేపీ టార్గెట్ గా I-PAC టీమ్.. హోటల్‌లో నిర్భందించిన పోలీసులు

2023లో త్రిపుర ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ టీమ్ అగర్తలా చేరుకుంది. గత వారం నుంచి అగర్తలాలోని ఒక హోటల్‌లో ఉంటున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన భారత రాజకీయ చర్య కమిటీ(I-PAC టీమ్) బృందాన్ని స్థానిక పోలీసులు ప్రశ్నించారు.

Prashant Kishor: బీజేపీ టార్గెట్ గా I-PAC టీమ్.. హోటల్‌లో నిర్భందించిన పోలీసులు

Prashanth

Prashant Kishor’s team: 2023లో త్రిపుర ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ టీమ్ అగర్తలా చేరుకుంది. గత వారం నుంచి అగర్తలాలోని ఒక హోటల్‌లో ఉంటున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన భారత రాజకీయ చర్య కమిటీ(I-PAC టీమ్) బృందాన్ని స్థానిక పోలీసులు ప్రశ్నించారు. I-PAC టీమ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను మరియు తృణమూల్ కాంగ్రెస్(TMC)కి సాధ్యమైన మద్దతు కూడగట్టేందుకు ఏం చెయ్యాలి అనేదానిపై అంచనా వేస్తోంది. అయితే, టీఎంసీ త్రిపుర యూనిట్ దీనిని “ప్రజాస్వామ్యంపై దాడి”గా అభివర్ణిస్తోంది.

అయితే, సాధారణ తనిఖీల్లో భాగంగా అగర్తలా నగరంలోని హోటల్‌లో 22 మంది సభ్యుల ఐ-పిఎసి బృందంలోని సభ్యులను ప్రశ్నిస్తున్నట్లు వెస్ట్ త్రిపుర పోలీసు సూపరింటెండెంట్ మానిక్ దాస్ పేర్కొన్నారు. మానిక్ దాస్ మాట్లాడుతూ, “సుమారు 22 మంది బయటి వ్యక్తులు వివిధ ప్రదేశాలలో తిరుగుతూ కనిపించారని, COVID పరిమితులు అమలులో ఉన్నందున, వారి రాకకు కారణాలను ధృవీకరించడానికి, నగరంలో ఉండటానికి గల కారణాల గురించి మేము వారిని విచారిస్తున్నామని చెప్పారు. వీరందరికి కోవిడ్ పరీక్షలు జరిపినట్లు చెప్పిన పోలీసులు.. నివేదిక ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ త్రిపుర యూనిట్ అధ్యక్షుడు ఆశిష్ లాల్ సింగ్ మాత్రం దీనిని ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. సింగ్ మాట్లాడుతూ, “ఇది ప్రజాస్వామ్యంపై దాడి. త్రిపుర నివాసిగా ఇటువంటి చర్య ఊహించనిది. త్రిపుర సంస్కృతి కాదు. అతిధి దేవో భవ అనేది త్రిపుర సంస్కృతి త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దుష్ప్రవర్తన కారణంగామ ప్రతీఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. త్రిపురలో టీఎంసీకి వచ్చిన, వస్తోన్న స్పందన, మద్దతు చూసి బీజేపీ భయపడుతోంది” అని అన్నారు.

ఐ-పాక్ బృందంని ఆదివారం రాత్రి నుంచి ఒక హోటల్‌లో గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే, పోలీసులు దీనిని సాధారణ దర్యాప్తులో భాగంగా పిలుస్తున్నారు. 23మంది సభ్యుల I-PAC టీమ్ వారం క్రితం రాష్ట్రానికి చేరుకుందని, ‘గ్రౌండ్ జీరో’ వద్ద సర్వే నిర్వహించడానికి అనేక ప్రదేశాలను కూడా సందర్శించామని సింగ్ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌తోనే కాకుండా ఇతర పార్టీలతో కూడా ఆయన చర్చలు జరిపారు. 2023 లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులను, టిఎంసి అవకాశాలను I-PAC టీమ్ అంచనా వేస్తోంది.

అయితే, I-PAC టీమ్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలను ఆశిష్ లాల్ సింగ్ చేసిన ఆరోపణలను జిల్లా పోలీసు చీఫ్ ఖండించారు. ఇది “సాధారణ ప్రక్రియ” అని అన్నారు. ఇదిలావుండగా, ఈ సంఘటనను తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ, ప్రొఫెషనల్ పొలిటికల్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్ I-PAC చీఫ్ ప్రశాంత్ కిషోర్లకు I-PAC టీమ్ నివేదించింది.