Zomato Shareholder: హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెడితే.. జొమాటోలో ఏమొచ్చిందో తెలుసా.. ట్విటర్‌లో మండిపడ్డ షేర్ హోల్డర్..

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ కస్టమర్లకు ఇతర రాష్ట్రాల్లో రుచులను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ సిటీ ఫుండ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకొనేందుకు జొమాటో షేర్ హోల్డర్ గురుగ్రామ్ నుండి హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అనుకున్న సమయానికి ఆర్డర్ వచ్చింది.. ఆర్డర్ ను విప్పిచూడగా ఒక్కసారిగా కంగుతిన్నాడు.

Zomato Shareholder: హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెడితే.. జొమాటోలో ఏమొచ్చిందో తెలుసా.. ట్విటర్‌లో మండిపడ్డ షేర్ హోల్డర్..

zomato order

Zomato Shareholder: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ కస్టమర్లకు ఇతర రాష్ట్రాల్లో రుచులను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ సిటీ ఫుండ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. అయితే కొన్ని నగరాల్లో మాత్రమే దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో గురుగ్రామ్‌కు చెందిన జొమాటో కస్టమర్, షేర్ హోల్డర్ ప్రతీక్ కన్వాల్ కు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఓ రెస్టారెంట్ లో నుండి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. దానిని రాత్రివేళ డిన్నర్ కోసమని ఆర్డర్ చేశాడు. అనుకున్న సమయానికే జొమాటోలో ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. వచ్చిన ఆర్డర్ ను ఓపెన్ చేసి చూడగా కంగుతిన్నాడు. బిర్యానీకి బదులుగా సాలన్‌ (బిర్యానీకి సైడ్‌ డిష్‌గా ఇచ్చే వంటకం) మాత్రమే వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రతీక్‌ ట్విటర్ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు.

Zomato Online Delivery: జొమాటోలో కొత్త సేవలు.. ఇతర నగరాల్లోని ఆహారం మీ ఇంటికొస్తుంది.. కానీ, కొన్ని షరతులు ..

ప్రతీక్ తన ట్వట్టర్ లో.. జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్‌ సర్వీస్‌ మంచి ఐడియా అనిపించింది. కానీ, నా డిన్నర్ ప్లాన్‌లు ఇప్పుడు గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు, మీరు నాకు గుర్గావ్‌లో బిర్యానీ ఇవ్వాల్సి ఉంది అంటూ జొమాటో సీఈఓని ట్యాగ్ చేశాడు. అంతేకాక వైఫల్యం ఎక్కడుందో సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ వెంటనే గుర్తించాలని కోరాడు. ప్రతీక్ కన్వాల్ ట్వీట్ కు జొమాటో కస్టమర్ కేర్ సర్వీస్ వెంటనే స్పందించింది. తప్పుజరిగినందుకు క్షమాపణలు కోరుతూ.. మళ్లీ తిరిగి ప్రతీక్ కన్వాల్ కోరిన దగ్గర నుంచి బిర్యానీని పంపించింది. దీంతో తన సమస్య పరిష్కారమైందని మరో ట్వీట్ చేశాడు.

భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను పంపిణీ చేయడానికి Zomato ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. తన ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ సేవ ద్వారా, భారతదేశం నుండి ఎక్కడికైనా ఆర్డర్ చేసేలా జొమాటో కృషి చేస్తోందని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో CEO  గోయల్ ఇటీవల తెలిపారు.