Himachal pradesh: సీఎం రేసులో పోటాపోటీగా ఆ ముగ్గురు నేతలు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించనుంది. ఈ విషయమై రాష్ట్ర రాజధాని షిమ్లాలోని రాజీవ్ భవన్‭లో సాయంత్రం 3:00 గంటలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ నేతలు లెజిస్లేచర్ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ ఎలక్షన్ సూపర్‭వైజర్ భూపేష్ బాఘేల్, ఇంచార్జీ రాజీవ్ శుక్లా, భూపేంద్ర సింగ్ హూడా మధ్యాహ్నం 1:00 గంటలకే రాజీవ్ భవన్ చేరుకోనున్నారు.

Himachal pradesh: సీఎం రేసులో పోటాపోటీగా ఆ ముగ్గురు నేతలు

Pratibha Singh, Sukhwinder Singh Sukhu, Mukesh Agnihotri lead race for Congress CM in Himachal Pradesh

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరో ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యే తీవ్రంగా ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిల మధ్య సీఎం కుర్చీ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ప్రతిభా సింగ్‭ వైపుకు కొంత ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్యతో పాటు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రతిభా సింగ్ ఉన్నారు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇక సుఖ్వీందర్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‭గా పని చేశారు. మూడో వ్యక్తి అగ్నిహోత్రి గత అసెంబ్లీలో విపక్ష నేతగా సీఎల్పీ నేతగా వ్యవహరించారు.

Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించనుంది. ఈ విషయమై రాష్ట్ర రాజధాని షిమ్లాలోని రాజీవ్ భవన్‭లో సాయంత్రం 3:00 గంటలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ నేతలు లెజిస్లేచర్ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ ఎలక్షన్ సూపర్‭వైజర్ భూపేష్ బాఘేల్, ఇంచార్జీ రాజీవ్ శుక్లా, భూపేంద్ర సింగ్ హూడా మధ్యాహ్నం 1:00 గంటలకే రాజీవ్ భవన్ చేరుకోనున్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రిని నిర్ణయించనున్నారు. వాస్తవానికి ఎన్నికలు ముగియగానే గెలిచిన వారిని ఛండీగఢ్‭లోని ఒక హోటల్‭కు తరలించాలని ముందస్తు నిర్ణయం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. మొహాలిలో కూడా ఒక హోటల్ సిద్ధం చేశారు. కానీ, పార్టీకి ప్రస్తుతం ఆ అవసరం లేకుండా పోయింది. కారణం ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది.

Himachal Pradesh: సంప్రదాయాన్ని మరువని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. కాంగ్రెస్ అందుకే గెలిచింది!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక స్వతంత్రులు మూడు స్థానాలు గెలుచుకున్నారు. ఓట్ బ్యాంకు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం రాగా బీజేపీకి 43 శాతం వచ్చాయి. ఇరు పార్టీల మధ్య ఓట్ బ్యాంకులో అతి స్వల్ప తేడానే ఉన్నప్పటికీ సీట్ల విషయంలో భారీ తేడా కనిపిస్తోంది. చాలా స్థానాల్లో అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ఫలితాలు చూస్తే తెలుస్తోంది.