ఢిల్లీలో 3 జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్…కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : April 29, 2020 / 08:59 AM IST
ఢిల్లీలో 3 జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్…కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న సీఎం

ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధినేత ఆకాంక్షించారు.

529మంది మీడియా సిబ్బందికి టెస్ట్ లు చేయగా కేవలం ముగ్గురకి మాత్రమే పాజిటివ్ వచ్చిందని,మిగిలిన వాళ్లందరికీ నెగిటీవ్ రావడం సంతోషం కలిగిచిందని కేజ్రీవాల్ అన్నారు. అందరికీ తన బెస్ట్ తెలియజేస్తున్నానన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మీడియా సిబ్బంది వర్క్ చాలా ముఖ్యమైనదన్నారు. పాజిటివ్ వచ్చినవాళ్లు తర్వగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా సోకినట్లు తేలడంతో..గతవారం,దేశరాజధానిలో పనిచేసే మీడియా సిబ్బందికి టెస్ట్ లు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ సెంటర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీలో  కరోనా సోకిన రోగుల సంఖ్య 3,314 కుచేరింది. అందులో 54 మంది మృతిచెందారు. రోగుల రికవరీ రేటు 32.52 శాతానికి పెరిగింది. వెయ్యి మందికి పైగా రోగులు కరోనా నుండి కోలుకున్నారు.