Miscarriage Problems : కాబోయే అమ్మలూ..ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..

గర్భం ధరించిన వారు..గర్భం ధరించాలని అనుకునేవారు గర్భస్రావం కాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.వాటిలో ముఖ్యమైనవి

Miscarriage Problems : కాబోయే అమ్మలూ..ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..

Pregnancy

Precautions for Miscarriage Problems : అమ్మకావాలనుకే వారు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టటానికి తల్లులు ఎంత ఇబ్బంది అయినా భరిస్తారు. ఆహారంలో మార్పులుచేసుకుంటారు. బిడ్డకు హాని కలిగించేది ఏదీ చేయకుండా జాగ్రత్త పడతారు. గర్భం ధరించిన తరువాత నిపుణుల సలహా ప్రకారంగా నడుచుకోవటం చాలా ముఖ్యం. కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అటువంటి సమయాల్లో గర్భస్రావాలు అయ్యే ప్రమాదాలు కూడా లేకపోలేదు.అలా జరకుండా ఉండాలంటే కాబట్టి కాబోయే తల్లులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది నిపుణులు తెలిపిన సూచనలు ఇలా ఉన్నాయి.

Thyroid problem treatment | Thyroid weight gain treatment |Thyroid disease

1. థైరాయిడ్: ఈ రోజుల్లో థైరాయిడ్ చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ఒత్తిడితో థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. థైరాయిడ్ సమస్యలు ఉంటే మహిళలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో థైరాయిడ్ అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది హార్మోన్ సంబంధిత సమస్య కాబట్టి. గర్భధారణలో సమయంలో డాక్టర్ సలహాల ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ కొన్నిసార్లు గర్భస్రావానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రసవం అయ్యేంత వరకు గర్భిణులు నిపుణుల పర్యవేక్షణలో ఉండటం తల్లికి బిడ్డకు చాలా చాలా ముఖ్యం.

Managing Diabetes During Pregnancy | Joslin Diabetes Center

2. మధుమేహం (డయాబెటిస్): చాలామంది మహిళలకు గర్భం ధరించాక డయాబెటీస్‌కి గురవుతారు. టైప్ 2 డాయాబెటిస్ గర్భం సమయంలో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి. తరచూ దీనికి సంబంధంచిన పరీక్ష చేసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ కొన్నిసార్లు గర్భం ధరించిన ప్రారంభ సమయాల్లో గర్భస్రావానికి దారితీస్తుంది. అంతేకాదు ఇది కాకుండా దీని కారణంగా పిల్లలలో రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Can Hormonal Imbalance Affect Pregnancy?

3. హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ : హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ గా అంటే అసమతుల్యత ఉండకూడదు.ఒక మహిళకు ఇప్పటికే హార్మోన్ల సమస్య ఉంటే లేదా ఆమె శరీరం తగినంత ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను తయారు చేయకపోతే సమస్య ఏర్పడుతుంది. అటువంటి సమయంలో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను సకాలంలో అర్థం చేసుకుంటే పరిస్థితిని మందులతో నియంత్రించవచ్చు. అందుకే నిపుణుల సలహాల ప్రకారం నడుకోవాలి.

Chromosome Abnormalities Fact Sheet

4. క్రోమోజోముల్ అసాధారణత: ఫలదీకరణ సమయంలో స్పెర్మ్, అండం రెండూ 23 క్రోమోజోమ్‌లను సమీకరించి మ్యాచ్‌ని ఏర్పరుస్తాయి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో తేడా వస్తే గర్భం కలగదు. ఇందులో ఏదైనా లోపం జరిగితే క్రోమోజోమ్ అసాధారణతలకు కారణమవుతుంది ఇది గర్భస్రావానికి దారితీస్తుంది.

Preg

5. ఫైబ్రాయిడ్స్ : గర్భాశయ ఫైబ్రాయిడ్లు, గర్భాశయ లోపాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కొన్నిసార్లు గర్భస్రావానికి కారణం అవుతాయి. అలాంటి ఏదైనా సమస్య ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భస్రావం వంటి సమస్యను నివారించడానికి వైద్య నిపుణుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలి.

ఏది ఏమైనా గర్భం ధరించాలనుకునే మహిళలు, గర్భం ధరించినవారు కూడా నిపుణుల సలహా ప్రకారం నడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కరోనా కాలంలో ఇది మరింత అవసరం. అలాగే పలు రకాల ఆరోగ్య సమస్యల కలిగిన మహిళలు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అసవరం ఉంది. గర్భం ధరించిన సమయంలో మహిళలకు పలు రకాల సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు గర్భస్రావాలకు కారణమైతే మరికొన్ని సమస్యలు బిడ్డ ఎదుగుదలలోను..వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం తల్లులు నిపుణుల సలహాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.