Mushroom : పుట్టగొడుగుల పెంపకంలో జాగ్రత్తలు

సాధారణంగా పుట్టగొడుగుల పెంపకం సరైన యాజమాన్య పద్ధతులతో పెంచితే ఎటువంటి వ్యాధులు రావు. సరైన పరిశుభ్రత చర్యలు పాటించకుంటే పుట్టగొడుగుల్లో ప్రధానంగా మెత్తటి బూజు

Mushroom : పుట్టగొడుగుల పెంపకంలో జాగ్రత్తలు

Mushroom

Mushroom : వ్యవసాయ అనుబంధ రంగాల్లో పుట్టగొడుగుల సాగు ఒకటి. పుట్టగొడుగుల పెంపకంపై ఇటీవలి కాలంలో ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరిగింది. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పుట్టగొడుగులకు ఏడాది పొడవునా మంచి ధర లభిస్తుండటంతో చాలామంది రైతులు, నిరుద్యోగ యువత వీటి పెంపకాన్ని చేపట్టి అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. తక్కువ శ్రమతో మంచి అదాయం వనరుగా పుట్టగొడుగుల పెంపకాన్ని భావిస్తున్నారు. ఏ రకానికి చెందినా పుట్టగొడుగులు అయినా, పరిశుభ్రమైన వాతావరణంలో తగు జాగ్రత్తలతో  వ్యాధులు రాకుండా చూసుకోవాలి.

సాధారణంగా పుట్టగొడుగుల పెంపకం సరైన యాజమాన్య పద్ధతులతో పెంచితే ఎటువంటి వ్యాధులు రావు. సరైన పరిశుభ్రత చర్యలు పాటించకుంటే పుట్టగొడుగుల్లో ప్రధానంగా మెత్తటి బూజు, గోధుమ రంగు బూజు, తెల్ల బూజు,ఆలివ్ గ్రీన్ బూజు, బ్లాక్ మోల్డ్, ఆకుపచ్చ , బ్యాక్టీరియా మచ్చలు, తెగుళ్ళు ఆశిస్తాయి. వీటి నివారణకు గదిలో డైక్లోరోవాస్ 6 మి.లీ. 10 లీటర్లు నీరు లేదా బావిస్టిన్ 0.1 శాతం లేదా ఫార్మాల్డిహైడ్ 10 శాతం గదుల గోడల వెంట, గోనె సంచుల పైన , నేల మీద ప్రతి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పిచికారి చేసుకోవాలి.

దోమ ఎక్కువగా ఉన్నట్లయితే వేప ద్రావణాన్ని 5 మి.లీ / లీ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. పుట్టగొడుగుల బెడ్స్ బ్యాక్టీరియా మచ్చలు కనిపిస్తే 2 గ్రా. బ్లీచింగ్ పౌడర్ని 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. క్రాపింగ్ రూములో ఎప్పటికప్పుడూ ఫార్మాల్డిహైడ్ 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. అనుకూలమైన వాతావరణం లేకపోతే పుట్టగొడుగుల నాణ్యత తగ్గుతుంది. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకం గదిలో సరైన గాలి, వెలుతురు వ్యవస్థ ఉండాలి. లేకుంటే పుట్ట గొడుగు నాణ్యత లోపించి సరైన ధర పలకదు.

పుట్టగొడుగులు 24 గంటల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. కనుక సూర్యరశ్మిలో గానీ విధ్యుచ్చక్తి ఉపయోగించి ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. ఎండబెట్టిన వాటిని గాలి చొరబడిని డబ్బాలో ప్యాక్ చేయాలి. పుట్టగొడుగులను 0.5% నిమ్మ ఉప్పుతో కడిగితే కొంత వరకు రంగు మారకుండా ఉంటాయి. నిల్వ ఉంచినప్పుడు సిలికాజెల్ ఒక చిన్న ప్యాక్ ను డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండిన పుట్టగొడుగులు 6 నెలల వరకు నిల్వ ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది.