DSP Shilpa Sahu : హ్యాట్సాఫ్ డీఎస్పీ మేడమ్.. నిండు గర్భంతో ఉన్నా మండుటెండల్లోనూ కరోనా వారియర్ డ్యూటీ

DSP Shilpa Sahu : ఛత్తీస్‌ఘడ్‌లోని ఓ మహిళా డీఎస్పీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అంతా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ మేడమ్ అంటున్నారు. రియల్ హీరో అని కితాబిస్తున్నారు. ఎందుకో తెలుసా.. మండుటెండుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదేం పెద్ద గొప్ప సంగతా అని అడగొచ్చు. అవును గొప్పే.. ఎందుకంటే ఆమె నిండు గర్భిణి. అయినా చేతిలో లాఠీ పట్టుకున్ని ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, కోవిడ్ రూల్స్ పాటించాలంటూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.

DSP Shilpa Sahu : హ్యాట్సాఫ్ డీఎస్పీ మేడమ్.. నిండు గర్భంతో ఉన్నా మండుటెండల్లోనూ కరోనా వారియర్ డ్యూటీ

Dsp Shilpa Sahu

DSP Shilpa Sahu : ఛత్తీస్‌ఘడ్‌లోని ఓ మహిళా డీఎస్పీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అంతా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ మేడమ్ అంటున్నారు. రియల్ హీరో అని కితాబిస్తున్నారు. ఎందుకో తెలుసా.. మండుటెండుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదేం పెద్ద గొప్ప సంగతా అని అడగొచ్చు. అవును గొప్పే.. ఎందుకంటే ఆమె నిండు గర్భిణి. అయినా చేతిలో లాఠీ పట్టుకున్ని ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, కోవిడ్ రూల్స్ పాటించాలంటూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.

Pregnant Dsp

దీన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. మండుటెండలో నిండు గర్భంతో విధులు నిర్వర్తిస్తున్న ఆమే.. డీఎస్పీ శిల్పా సాహు. ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ లోని దంతేవాడ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు వహించాలని డీఎస్పీ కోరుతున్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునే జాగ్రత్తలను, మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూసేందుకు మండుటెండల్లో సైతం ఆమె డ్యూటీ చేస్తున్నారు.

Pregnant Chhattisgarh DSP

స్వయంగా ట్రాఫిక్ నియంత్రిస్తున్న శిల్పా సాహు ఫొటోను ట్విటర్ లో షేర్ చేస్తూ అడిషినల్ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ దీపాన్షు కబ్రా ఇలా రాశారు.. ‘దంతెవాడ డీఎస్పీ శిల్పాసాహు ఫొటో ఇది. గర్బిణిగా ఉన్నా విధుల్లో తన టీంతో బిజీగా ఉంది. అంతేకాదు కోవిడ్ నిబంధనలు పాటించాలని, లాక్ డౌన్ ను ఉల్లంఘించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. మహమ్మారి నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి ప్రజల్ని కాపాడడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీ వంతు బాధ్యతగా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నెటిజన్లు.. శిల్పాసాహు కమిట్ మెంట్ ను ప్రశంసించారు. విధుల పట్ల ఆమె అంకితభావాన్ని అభినందించారు. కరోనా మహమ్మారి వణికిస్తున్న ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడటమే ముఖ్యమని ఆలోచించిన ఆమె రియల్లీ గ్రేట్ అని ట్వీట్ చేశారు. అనేకమంది ఆమెను హీరో అంటూ పొగిడారు. మరికొంతమంది శిల్పాసాహూకు సలామ్ చెప్పారు. అదే సమయంలో మీరు, మీ కడుపులోని బిడ్డ కూడా జాగ్రత్త అని సూచించారు.

కాగా, ఇలాంటి మహమ్మారి సమయంలో గర్భిణి అయిన శిల్పా.. ఇంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదని మరికొందరు చెప్పారు. ఇది తప్పు.. ఆమె అలా చేయకూడదు అని అన్నారు. ఆమెకు సెలవు ఇవ్వచ్చు కదా అంటూ మరికొందరు ట్వీట్ చేశారు.

కరోనా వైరస్‌ మన దేశంలో ప్రబలడం మొదలైన నాటి నుంచి కరోనా వారియర్స్‌ చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. డీఎస్పీ శిల్పా ఇదే కోవలోకి వస్తారు. శిల్పా సాహు విధులు నిర్వర్తిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా కట్టడికి ఫ్రంట్‌ లైన్ వర్కర్లు, వారియర్లు తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టి ప్రజలను రక్షిస్తున్నారో తెలిపేందుకు ఈ వీడియో చక్కటి ఉదాహరణ. దీన్ని చూశాక అయినా ప్రజల్లో మార్పు రావాలి. తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి.