Pregnant Nurse : హ్యాట్సాఫ్ నర్స్.. గర్భంతో ఉన్నా భయపడకుండా కరోనా రోగులకు వైద్యసేవలు, ఆసుపత్రిలోనే రంజాన్ ఉపవాసం

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ డాక్ట‌ర్లు, న‌ర్సులు త‌మ ప్రాణాల‌ను పణంగా పెట్టి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఓ నర్సు తన గొప్ప మనసు చాటుకుంది. ఆమె నాలుగు నెలల గర్భిణి. కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తోంది. ఏమాత్రం బెదరకుండా కోవిడ్ రోగుల‌కు సేవ‌లందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది.

Pregnant Nurse : హ్యాట్సాఫ్ నర్స్.. గర్భంతో ఉన్నా భయపడకుండా కరోనా రోగులకు వైద్యసేవలు, ఆసుపత్రిలోనే రంజాన్ ఉపవాసం

Pregnant Nurse

Pregnant Nurse : కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. ప్రజలంతా ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కరోనా పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే.. అటువైపు వెళ్లే సాసహం కూడా చెయ్యడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ డాక్ట‌ర్లు, న‌ర్సులు త‌మ ప్రాణాల‌ను పణంగా పెట్టి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణతో.. దేశవ్యాప్తంగా వైద్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అయినా వైద్య సిబ్బంది వెనుకంజ వెయ్యలేదు. ఎంతో ఓపిగ్గా కోవిడ్ రోగులకు సేవలు అందిస్తూనే ఉన్నారు.



తాజాగా ఓ నర్సు తన గొప్ప మనసు చాటుకుంది. ఆమె నాలుగు నెలల గర్భిణి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తోంది. ఏమాత్రం బెదరకుండా కోవిడ్ రోగుల‌కు సేవ‌లందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది.

సూర‌త్‌కు చెందిన నాన్సి అయేజా మిస్ర్తీ ఓ ఆస్ప‌త్రిలో న‌ర్సుగా ప‌ని చేస్తోంది. ఆమె ప్ర‌స్తుతం నాలుగు నెల‌ల గ‌ర్భిణి. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం ఆందోళన చెందకుండా కోవిడ్ రోగులకు వైద్య సేవ‌లు అందిస్తోంది. రంజాన్ సందర్భంగా ఆసుపత్రిలోనే ఆమె రోజాలో(ఉపవాసం) ఉంది. ”నా కడుపులో బిడ్డ ఉంది. నాకు నా విధులే ముఖ్యం. నా విధిని నేను నిర్వ‌ర్తిస్తున్నా. ఈ పవిత్ర మాసం(రంజాన్) లో రోగుల‌కు సేవ చేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. త‌న‌కు అతిపెద్ద ప్రార్థ‌న అంటుంది. రోగుల‌కు సేవ చేయ‌డ‌మే నాకు అతిపెద్ద ప్రార్థ‌న” అని న‌ర్సు అంటుంది.



అల్తాన్ కమ్యూనిటీ హాల్ లోని అటల్ కోవిడ్-19 సెంటర్ లో ఆమె విధులు నిర్వహిస్తోంది. రోజూ 8 నుంచి 10 గంటల పాటు విధుల్లో ఉంటుంది. గర్భంతో ఉన్నా భయపడకుండా వైద్య సేవలు అందిస్తున్న నర్సుకి రోగులు దీవెనలు అందిస్తున్నారు. నువ్వు చల్లగా ఉండు తల్లీ అని దీవిస్తున్నారు. తన కడుపులో బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటూనే మరో పక్క కరోనా రోగులను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ.. ఒకే సమయంలో రెండు బాధ్యతలనూ సమర్థవంతంగా పోషిస్తోంది.