గర్భవతైన భార్యను టీచర్ పరీక్ష కోసం స్కూటీపై 1300 కిలోమీటర్లు తీసుకెళ్లాడు..

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 09:07 AM IST
గర్భవతైన భార్యను టీచర్ పరీక్ష కోసం స్కూటీపై 1300 కిలోమీటర్లు తీసుకెళ్లాడు..

జార్ఖండ్‌లో నివసిస్తున్న ఓ మహిళ.. టీచర్ కావాలనే కలతో మధ్యప్రదేశ్‌లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు చేస్తోంది. కరోనా కారణంగా ఇంతకాలం వాయిదాపడిన రెండో ఏడాది పరీక్షలు జరుగుతుండటంతో వాటికి హాజరయ్యేందుకు పెద్ద సాహసం చేసింది. ప్రస్తుతం 7నెలల గర్భిణీ అయిన ఆమె… పరీక్షల కోసం 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వచ్చింది.



ట్యాక్సీలో వెళ్లేంత డబ్బులు లేకపోవడంతో… భర్తతో కలిసి స్కూటీపై ప్రయాణం మొదలెట్టింది. ఓవైపు వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తుంటే.. 3 రాష్ట్రాల్లోని వాగులు దాటింది. ప్రయాణ సమయంలో తన కాళ్లు మొద్దుబారినా… నడుము, కడుపులో నొప్పి వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు కదిలి చివరికి గమ్యాన్ని చేరింది.
https://10tv.in/centre-sets-ground-rules-for-metros-to-resume-from-sept-7/



ఈ ప్రయాణంలో పెట్రోల్‌ ఖర్చు కోసం ఆమె నగలను కూడా తాకట్టుపెట్టింది. అయితే ఈ విషయం తెలుసుకున్నమధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ దంపతుల తిరుగు ప్రయాణానికి ఫ్లైట్‌ టికెట్లు బుక్‌చేసింది. వాళ్ల స్కూటీని రైల్వే పార్శిల్ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేసింది.