బీజేపీ రోడ్ షోలో చిక్కుకున్న గర్భిణి

బీజేపీ రోడ్ షోలో చిక్కుకున్న గర్భిణి

గాయాలపాలైన ప్రెగ్రెంట్ ను హాస్పిటల్ కు తరలిస్తున్న అంబులెన్స్ హర్యానాలోని సిర్సా లోక్ సభ బీజేపీ అభ్యర్థి సునీతా దుగ్గల్ రోడ్ షో కారణంగా 15 నిముషాల పాటు ట్రాఫిక్‌ లో చిక్కుకుంది.శుక్రవారం(ఏప్రిల్-19,2019)ఈ ఘటన జరిగింది.చేతికి గాయమైన గర్భిణిని కోమల్ ని మొహమ్మద్ పూర్ రోహి గ్రామం నుంచి ఫతేహాబాద్ టౌన్ లోని సివిల్ హాస్పిటల్ లోకి అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చివరకు ఎలాగోలా అంబులెన్స్ ముందుకు కదిలింది.ఈ ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి సునీతా దుగ్గల్… తన కారణంగా ఇబ్బంది కలిగినందుకు క్షమాపణలు కోరుతున్నానన్నారు