సోషల్ మీడియాలో కంటెంట్‌కు సెన్సార్ కట్.. కేంద్రం కొత్త చట్టం!

సోషల్ మీడియాలో కంటెంట్‌కు సెన్సార్ కట్.. కేంద్రం కొత్త చట్టం!

ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నెట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కంటెంట్‌ను నియంత్రించడానికి సన్నాహాలు పూర్తి చేసింది కేంద్రం. సంబంధిత చట్టాన్ని సవరించడం ద్వారా వినియోగదారుల హక్కులను బలోపేతం చేయబోతుంది ప్రభుత్వం. అభ్యంతరకరమైన మరియు మార్ఫింగ్ పోస్టులను తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే పాటించేలా సదరు సంస్థలకు నోటీసులు ఇవ్వబోతుంది కేంద్రం. ఈ విషయంలో మంగళవారం(19 ఫిబ్రవరి 2021) నాటికి ఒక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఐటి మంత్రిత్వశాఖ ఇందుకోసం ఓ ముసాయిదాను సిద్ధం చేసింది. దీని కోసం డేటాను స్థానికీకరించాలని, భారతదేశంలో ఒక సంస్థగా నమోదు చేసుకోవాలని కంపెనీలను కోరబోతోంది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఉన్న మేజర్ కంపెనీలు.. తమ భారతీయ సంస్థలను కేవలం బిల్లింగ్ కోసం మాత్రమే సూచిస్తున్నారు. వారి మొత్తం వ్యవస్థ విదేశాలలో ఉంటోంది. అందువల్ల సోషల్ మీడియాలో ప్రతీ విషయం సంబంధిత సంస్థ ఇష్టానుసారం జరుగుతోంది.

ఈ క్రమంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోగా.. పోస్ట్‌లను కూడా పరిమితం చేయవచ్చునని అంటున్నారు. కొత్త చట్టం ప్రకారం, సోషల్ మీడియాలో ఏకపక్ష వైఖరి పనిచేయదు. సోషల్ మీడియా నిరంతరం ఏ రకమైన పోస్ట్‌లను ఉంచవచ్చో.. హెచ్చరిక ఉన్నప్పటికీ, కంపెనీలు వారి మాటలను వినట్లేదు, ఈ క్రమంలోనే కేంద్రం ముసాయిదా రూపొందించింది.

ముఖ్యమైన విషయాలు:
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డేటా మరియు కంటెంట్‌ను వినియోగదారులకు ఒక నిర్దిష్ట సమయం వరకు కనెక్ట్ చేయాలి.
ప్రభుత్వం ఆదేశిస్తే సంబంధిత పోస్టును 24 గంటల్లో తొలగించాలి.. లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి.
నోడల్ ఏజెన్సీ ద్వారా 24 గంటలు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదులను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.
OTT ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇకపై నోడల్ ఏజెన్సీ పరిధిలోకి రావచ్చు. వారు ప్రభుత్వ సూచనల మేరకు కంటెంట్‌ను తొలగించాలి లేదా సవరించాలి
OTT కోసం సెన్సార్ బోర్డు వంటి కమిటీ ఏర్పాటు చేయవచ్చు, ఇది వారి కంటెంట్‌ను పర్యవేక్షిస్తుంది.

ఇటీవల రైతు ఉద్యమం నేపధ్యంలో.. కొన్ని హ్యాష్ ట్యాగ్‌లను వాడకుండా నియంత్రించాలని ట్విట్టర్‌ను కేంద్రం కోరగా.. ట్విట్టర్ పట్టించుకోలేదు. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి భావ ప్రకటనా స్వేచ్ఛ పాఠాన్ని నేర్పించడం ప్రారంభించింది. అంతకుముందు, వాట్సాప్ గోప్యతా విధానంలో, వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునే విషయం కూడా తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా నిబంధనలపై వివక్ష చూపుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక చట్టాలను రూపొందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.