President Droupadi Murmu : వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకోవటానికి ఆకలిని చంపుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి..

వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకోవటానికి ఆకలిని చంపుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన భావోద్వేక ప్రసంగానికి ఒడిశాలోని రమాదేవి యూనివర్శిటీ వేదికగా నిలిచింది.

President Droupadi Murmu : వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకోవటానికి ఆకలిని చంపుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి..

president draupadi murmu emotional speech in ramadevi university in Bhubaneswar

President Droupadi Murmu : ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని రమాదేవీ మహిళా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ భావోద్వానికిలోనయ్యారు. అదే వర్శిటీలో చదువుకున్న ద్రౌపది ముర్ము తన పాతకాలంనాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఎన్నో కష్టాలు పడి చదువుకున్నానని చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదువుకున్నానని ఈసందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. వర్శిటీ క్యాంటీన్ లో తినటానికి డబ్బులు లేక వీధి వ్యాపారుల వద్ద తినేద్దాన్ని అని తెలిపారు. నేను వర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఒక చిరువ్యాపారి నిమ్మకాయలు,మిరపకాయలు,వేరుశెనగ కాయలు 25 పైసలకు అమ్మటం చూశారని అవి ఇప్పటికీ నాకు గుర్తున్నాయని తెలిపారు.

ఒడిశా రాష్ట్రానాకి చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మయూర్‌భంజ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి చదువు కోసం భువనేశ్వర్ వచ్చానని అలా నేను రమాదేశి వర్శిటీలో చదువుకున్నానని తెలిపారు. నా చదువుకు పేదరికం ఎంతో అవరోధాలు కల్పించేది. అయినా చదువుతోనే ఉన్నతి సాధించగలమని నమ్మిన నేను చదువు ఆపకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువు కొనసాగించానని చెప్పుకొచ్చారు. చిరు వ్యాపారి అమ్మే వేరుశనక్కాయలు తినాలని మనస్సులో ఎంతో ఆశగా ఉండేది. కానీ ఆ పావలా (25 పైసలు) కూడా నాదగ్గర ఉండేది కాదు..ఒకవేళ ఉన్నా ఆ పావలా మిగుల్చుకోవటానికి ఇష్టమైన వేరుశెనగకాయలు కొనుక్కోకుండా ఉండిపోయేదన్నని అలా ఆకలిని చంపుకున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయని భావోద్వేగంగా చెప్పాకొచ్చారామె.

ఈ యూనివర్శిటీలో నాకు చదువునేర్పిన గురువులకు నేను ఎంతగానో రుణపడి ఉంటానని..వారి సహాయ సహకారలతో నేను వర్శిటీ విద్య పూర్తి చేసుకున్నానని తెలిపారు. వారు నాకు మార్గనిర్ధేశం చేసేవారు అని గుర్తు చేసుకున్నారు. అటువంటివారిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదువుకుని ఈరోజు మీముందు ఈ స్థానంలో నిలిచారని కష్టపడి చదువుకుంటే ఎవ్వరైనా ఉన్నతస్థానాలకు చేరుకుంటారని విద్యార్ధులను ప్రోత్సహించారు.

అలాగే లింగ వివక్ష గురించి కూడా ద్రౌపది ముర్ము మాట్లాడుతు..నేను చదవుకునే రోజుల్లో అందరు ఎందుకు ఈ పనికిరాని చదువులు..ఆడపిల్లలు ఎంత చదువు చదువుకున్నా పెళ్లి చేసుకోక తప్పదు..రేపు నువ్వు కూడా అంతే పెళ్లి చేసుకోవాల్సిందే..అప్పుడు నీ చదువు ఎందుకు పనికిరాకుండాపోతుంది అంటూ మాట్లాడేవారని తెలిపారు. కానీ చదువు అన్నింటికి పరిష్కారం చూపుతుందని ఆ విలువ తెలిసే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆకలిని చంపి మరీ చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్లడం సంతోషకరమని తెలిపిన రాష్ట్రపతి ముర్ము చరిత్రలో ఎంతోమంది మహిళలు అసాధ్యం అనుకున్నవి సాధ్యం చేసి చూపించారు అటువంటి పోరాటాలతో వారి జీవితాలను చక్కదిద్దుకున్నారు. సమాజంలో ఎంతో చైతన్యం తెచ్చిన వీరనారీమణుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరికి పీహెచ్‌డీ, 22 మందికి పసిడి పతకాలు అందజేశారు. రెండు రోజులపాటు ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లార్డ్ లింగరాజ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత కటక్‌లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రెండవ ఇండియన్ రైస్ కాంగ్రెస్‌ను ప్రారంభించనున్నారు.