Droupadi Murmu : సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది.

Droupadi Murmu Flies In Fighter Jet
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu ) సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. తన సొంత రాష్ట్రమైన అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ఫ్లయింగ్ సూట్ ధరించి ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. అస్సాంలో పర్యటిస్తున్న సందర్భంగా ద్రౌపది ముర్ము తొలిసారిగా సుఖోయ్-30 MKI (Sukhoi-30 MKI) యుద్ధ విమానంలో ప్రయాణించారు.
తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. అక్కడ భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. తరువాత ఆమె ఫ్లయింగ్ సూట్ ధరించి సుఖోయ్-30 విమానంలో బ్రహ్మపుత్ర,తేజ్ పూర్ లోయలను కవర్ చేస్తూ 30 నిమిషాలపాటు విహరించారు. ద్రౌపది ముర్ము ప్రయాణించిన సుఖోయ్ విమానాన్ని 106 స్వ్రాడ్రన్ కమాండింగ్ అధికారి గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది.
ఈ ఏడాది మార్చిలో ద్రౌపది ముర్ము INS విక్రాంత్ ను సందర్శించారు. స్వదేశీయంగా తయారు చేసిన ఈ విమానంలో అధికారులతో ఆవిడ సంభాషించారు. కాగా.. 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించిన విషయం సుఖోయ్-30 MKI విమానం రష్యాకు చెందిన సుఖోయ్ అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ మల్టీరోల్ ఫైటర్ జెట్. అలాగే భారతదేశపు ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో నిర్మించబడింది.