President Polls: భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక నేడే, ఒక్కో ఓటు విలువ 700

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రథమ పౌరుని ఎంపికకు వేళైంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా మారిన ఎన్నికలో ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా ద్రౌపది ముర్ము,విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాగా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రచారాన్ని ఇరువురు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.

President Polls: భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక నేడే, ఒక్కో ఓటు విలువ 700

Presidential Elections

 

President Polls: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రథమ పౌరుని ఎంపికకు వేళైంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా మారిన ఎన్నికలో ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా ద్రౌపది ముర్ము,విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాగా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రచారాన్ని ఇరువురు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.

జులై 18 సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఈ ఎన్నికలో 4వేల 809 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

776 మంది ఎంపీలు,4 వేల 33 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లోని రూం నంబర్ 63లో 6 పోలింగ్ బూత్‌ లు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు కాకుండా సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.

Read Also: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధనకర్

ప్రత్యేకమైన పెన్ను:
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పెన్ను ద్వారా మాత్రమే సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనాలి. ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు.

వేరే చోటు నుంచి ఓటు
51 మంది ప్రజాప్రతినిధులు సొంత రాష్ట్రంలో కాకుండా మరోచోట నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌లో ఓటు వేయనున్నారు. 42 మంది ఎంపీలు వివిధ రాష్ట్రాల శాసనసభల్లో ఓటు వేయనున్నట్లు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. 4 యూపీ, అస్సాం, హర్యానా, ఒరిస్సాల నుంచి ఒక్కొక్కరు, 2 త్రిపుర ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌లో ఓటు వేయనున్నట్లు తెలిసింది.

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే పార్లమెంట్‌కు బ్యాలెట్ బాక్సులు పంపిస్తారు. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈసీ పరిశీలకుల సమక్షంలో ఈ తంతు పూర్తవుతుంది.

ప్రమాణ స్వీకారం:
జూలై 21న పార్లమెంట్‌లో ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికైన అభ్యర్థి జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం పూర్తి చేస్తారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఎలక్ట్రోరల్ కాలేజీలో ఎంపీలు, ఢిల్లీ, పుదుచ్చేరి సహా అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఎంపీలకు ఎమ్మెల్యేలకు విడివిడిగా ఓటు హక్కు విలువ ఉంటుంది. దీనిని 1971 జన గణన ఆధారంగా చూస్తారు. ఎంపీలు ఒక్కొక్కరికి ఓటు విలువ 700గా ఉంది.