ఫస్ట్ టైమ్..వార్ మెమోరియల్ ను సందర్శించిన రాష్ట్రపతి

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2019 / 02:05 PM IST
ఫస్ట్ టైమ్..వార్ మెమోరియల్ ను సందర్శించిన రాష్ట్రపతి

ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్,ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు కోవింద్ తో పాటుగా వార్ మెమోరియల్ ను సందర్శించారు.

40 ఎకరాల్లో నిర్మించిన ఈ జాతీయ యుద్ధ స్మారకం.. నాలుగు కూడళ్లతో ఉంటుంది. అమర్ చక్ర, వీర్థ చక్ర,త్యాగ్ చక్ర,రక్షక్ చక్ర అనే పేర్లతో ఈ నాలుగు కూడళ్లు ఉంటాయి. పరమవీరచక్ర అవార్డులు అందుకున్న వారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దేశపు అత్యున్నత శౌర్య పురస్కారం అందుకున్న సుబేదార్  మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్,సుబేదార్ సంజయ్ కుమార్,బనాసింగ్ ల విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి.ఫిబ్రవరి-25,2019న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ వార్ మెమోరియల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.