Presidential Election 2022 : రసవత్తరంగా రాష్ట్రపతి ఎన్నికలు.. రేపే నోటిఫికేషన్

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

Presidential Election 2022 : రసవత్తరంగా రాష్ట్రపతి ఎన్నికలు.. రేపే నోటిఫికేషన్

Presidential Election 2022

Presidential Election 2022 : రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బుధవారం(జూన్ 15) నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై బుధవారం ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. దీనికి పలు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

శరద్ పవార్‌ను ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయి. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి పవార్ విముఖంగా ఉన్నారు. దీంతో ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Rashtrapati election : ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికల రేసు

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ సహా విపక్షాలు, తటస్థ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరపనున్నారు. తమ అభ్యర్థి గెలుపొందాలంటే మెజారిటీ మార్కుకు స్వల్ప దూరంలో ఎన్డీయే కూటమి ఉంది. వైసీపీ లేదా బీజేడీ మద్దతుతో బయటపడేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో రాష్ట్రపతి ఎన్నికపై ప్రధాని మోదీ చర్చలు జరిపారు.

presidential elections: విపక్షాల మధ్య లోపిస్తున్న ఐక్యత.. రేపటి భేటీకి దూరంగా సీఎంలు