ఆ కుర్చీనే అంత పని చేసింది: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

  • Published By: vamsi ,Published On : November 12, 2019 / 12:52 PM IST
ఆ కుర్చీనే అంత పని చేసింది: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఆమోదిస్తూ రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో వెంటనే రాష్టంలో రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోగా.. గవర్నర్ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

అంతకుముందు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిపై కేంద్ర కేబినేట్ అత్యవసరంగా చర్చించి నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయం తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి పాలన నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు.

మరోవైపు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, రెండు రోజుల గడువు కోరినా గవర్నర్ ఇవ్వకపోవడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సుప్రీం కోర్టు మెట్లెక్కింది. స్థిరంగా నిలలబడగలిగే ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేని కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.