Tomato Cultivation : టమాటో సాగులో పురుగులు, తెగుళ్ళ నివారణ

ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపలి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి.

Tomato Cultivation : టమాటో సాగులో పురుగులు, తెగుళ్ళ నివారణ

Tomato

Tomato Cultivation : కూరగాయలలో ప్రధాన పంట టమాటా. శీతాకాలంలో వేసిన టమాటా పంట మంచి దిగుబడినిస్తుంది. మార్కెట్లో వచ్చే ధరల హెచ్చు తగ్గులకు రైతులు అన్నీ కాలాలలోనూ ఈ పంట సాగుకు మగ్గువ చూపుతున్నారు. సున్నితమైన ఈ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశిస్తాయి. పంటను ఆశించే పురుగులు, తెగుళ్ళ గురించి రైతులు అవగాహన కలిగి ఉండటం అవసరం. ఆవివరాలను తెలుసుకుందాం..

కాయతొలచు పురుగు ; దేనినే పుచ్చు తెగులు అనికూడా పిలుస్తారు. ఈ కాయతొలుచు పురుగు లార్వాలు పండుకి రంధ్రం చేసి పండును మొత్తం నాశనం చేస్తుంది. వీటి వల్ల పంట యొక్క దిగుబడి 40-50% వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ తెగులు ఆశించిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా నివారణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు మొక్క వయస్సు 40-45 రోజుల మధ్య NVP తగిన మోతాదులో పిచికారి చేసుకోవాలి.

శనగ పచ్చ పురుగు ; టమాటా పంట వేసిన 15 – 20 రోజుల దశలో శనగ పచ్చ పురుగు ఆశిస్తుంది. శనగ పచ్చ పురుగు చుట్టు పక్కల పొలాల్లో వేసిన కంది పంట నుంచి ఆశిస్తుంది. ఈ పురుగు టమాటా మొక్క లేత ఆకులను గోకి తినేస్తుంది. ఈ పరుగు పెరుగుతున్న కొద్దీ ఆకుల నుంచి కాయలకు రంధ్రాలు చేసి కాయ లోపలి గుజ్జునంతటిని తినేస్తుంది. దీనివల్ల కాయకుళ్ళు తెగులు వస్తుంది. పొలంలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. బంతి పంటను అంతర పంటగా వేసుకోవాలి. పురుగు ఆశించిన తొలిదశలో ప్రొపినోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా థయోకార్బ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయెట్ 5 గ్రా. లేదా ట్రేసర్ 4 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 4గ్రా. 10 లీటర్ల నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.

తెల్లదోమ ; ఈ తెల్లదోమ టమాటో పంటకు చాల హానికరమైన తెగులు. ఈ తెగులు ఆకు వెనుకవైపు అభివృద్ధి చెందుతుంది. తెల్లదోమ యొక్క ప్రమాదకరమైన మలాన్ని ఆకులపై విసర్జిస్తుంది. దీనివల్ల మొక్క అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఈ తెగులును మొదట్లోనే గుర్తించడానికి చేనులో పసుపు కర్ర ఉచ్చులను ఉపయోగించాలి. తెల్లదోమ తెగులు దాడి తీవ్రత పెరగకముందే ఇమిడాక్లోప్రిడ్ 20 SL ఒక్క లీటర్ నీటిలో 3 మీ.లీ కలుకొని పిచికారి చేసుకోవాలి. లేదా డైమెథోయేట్ ఒక్క లీటర్ నీటిలో 2 మీ.లీ కలుపుని పిచికారి చేసుకోవాలి.

లీఫ్ మైనర్ ; ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపలి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇది చూడటానికి ఎలుకల బోరియ(కన్నం) లాగా ఉంటాయి. ఈ తెగులు వల్ల మొక్క ఆకుపై తెల్లని చారలు ఏర్పడుతాయి. దీని వల్ల మొక్కకు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ తగ్గుతుంది. దీనివల్ల మొక్కకు మరియు కాయల అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. లీఫ్ మైనర్ తెగులు సోకినా తెల్లని చారలు ఉన్న ఆకులను వెంటనే మొక్కనుండి తొలగించాలి. అలాగే వేపనునే 3-4% నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ తెగులు ఎక్కువగా వ్యాపించి ఉంటె ట్రయాజోఫోస్లీటర్ నీటిలో 1 మీ.లీ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

నూలి పురుగు ; ఈ నూలిపురుగు మొక్క యొక్క వేర్లభాగంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మొక్క నీటిని మరియు పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గి మొక్క చనిపోవడం జరుగుతుంది. నూలిపురుగు ఉధృతిని తగ్గించడానికి పంతమర్పిది చర్యలను చెప్పట్టాలి. పంట, పంటకి మధ్య విరామ సమయాన్ని కూడా పెంచాలి. పంట చేను మధ్యలో కొన్ని సాలుల మధ్య బంతి పువ్వుల మొక్కలను పెంచండి. లేదా కార్బోఫ్యురాన్ 3G గుల్లికలు ఎకరానికి 500 గ్రాములు వెయ్యడంవల్ల నూలిపురుగు ఉధృతిని కొంతవరకు నివారించవచ్చు.