Household Budget : నిత్యావసర ధరలు పెరిగాయి.. మార్చిలో మీ ఇంటి బడ్జెట్ ఎంత పెరిగిందో చూశారా?

Household Budget : ఈ ఏడాదిలో మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఇదే సమయంలో భారీగా ధరలు పెరిగిపోయాయి. మార్చి నెలలో ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Household Budget : ఈ ఏడాదిలో మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఇదే సమయంలో భారీగా ధరలు పెరిగిపోయాయి. మార్చి నెలలో ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలలోనే గృహ బడ్జెట్ పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం సామాన్యులకు మరింత భారంగా మారింది. మొన్నటివరకూ కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయినా వారంతా ఇప్పుడెప్పుడే పుంజుకుంటున్నారు. ఇంతలోనే నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. సామాన్య, మధ్యతరగతి వారిలో ఈ పెరిగిన ధరలతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారింది. ఇంతకీ మార్చిలో ఏయే నిత్యావసర ధరలు పెరిగాయో ఓసారి చూద్దాం..

పెట్రోల్, డీజిల్ ధరలు :
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం… పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర గతంలో రూ. 95.41 నుంచి ఇప్పుడు రూ. 96.21 పెరిగింది. డీజిల్ ధరలు లీటరుకు రూ. 86.67 నుంచి రూ. 87.47కి పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.0.84 పెరిగి రూ.110.82కి చేరగా, డీజిల్ ధర రూ.0.86 నుంచి రూ.95కి పెరిగింది. వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) వంటి స్థానిక పన్నులపై రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి రేట్లు మారిపోయాయి. రాష్ట్ర చమురు సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు ధరలను పెంచుతుంటాయి. రాబోయే రోజుల్లో ఈ ఇందన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

LPG గ్యాస్ ధర :
ప్రతి సామాన్యుడి గృహ అవసరాల్లో ఇదొకటి.. LPG గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎల్‌పిజి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెరిగింది. దేశ రాజధాని, ముంబైలో 14.2 కేజీల సిలిండర్‌పై సబ్సిడీ లేని ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.949.50కి పెరిగింది. కోల్‌కతాలో రూ.976కి పెరిగింది. సబ్సిడీ లేని వంట గ్యాస్‌ను కస్టమర్లు 12 సిలిండర్‌ల కోటాలో సబ్సిడీ కింద మార్కెట్ ధర కంటే తక్కువగా కొనుగోలు చేయొచ్చు. అదే సబ్సిడీ లేదంటే.. LPG కస్టమర్లు అత్యధిక రేటుకు చెల్లించాలి. 2014 జనవరిలో నాన్-సబ్సిడీ రేటు గరిష్టంగా రూ.1,241కి చేరుకుంది. ఇదే సమయంలో ప్రభుత్వం సిలిండర్‌కు రూ.600 సబ్సిడీని అందించిందని నివేదిక పేర్కొంది.

బల్క్ కస్టమర్లకు డీజిల్ ధర ఎంతంటే? :
బల్క్ కస్టమర్లకు విక్రయించే డీజిల్ ధర మార్చి నెలలో లీటరుకు సుమారు రూ.25 పెరిగింది. పెంచిన ఈ డీజిల్ ధరలు.. మాల్స్, ఎయిర్‌పోర్ట్‌ల్లో వాడే భారీ కస్టమర్ల కోసం డీజిల్‌ను బ్యాకప్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తాయని నివేదిక తెలిపింది.

Household Budget How Your Household Budget Increased In March Month

అమూల్, మదర్ డైరీ మిల్క్ ధరలు :
మార్చిలో అమూల్ పాలు, మదర్ డెయిరీ ధరలు పెరిగాయి. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా ‘అమూల్’ పాల ధర లీటరుకు రూ. 2 తగ్గుతుందని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) తెలిపింది. రూ.2 పెంపుతో, అహ్మదాబాద్, ఢిల్లీ NCR, కోల్‌కతా, ముంబై మెట్రో మార్కెట్లలో ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్‌కు రూ.60, టోన్డ్ మిల్క్ అహ్మదాబాద్‌లో లీటరుకు రూ.48, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతాలో రూ.50 వరకు పెరిగింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మదర్ డెయిరీ పాల ధరలను లీటరుకు రూ.2 పెంచింది. పెరుగుతున్న సేకరణ ధరలు, ఇంధన ఖర్చులు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చుల దృష్ట్యా, మదర్ డెయిరీ మార్చి 6, 2022 నుంచి ఢిల్లీ NCRలో లిక్విడ్ మిల్క్ ధరలను రూ. 2/లీటర్‌కు పెంచాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది.

మాగీ, టీ, కాఫీ ధరలు :
70 గ్రాముల మ్యాగీ మసాలా నూడుల్స్ ప్యాకెట్ ధర గతంలో రూ.12 ఉండగా ఇప్పుడు రూ.14కు పెరిగింది. 140 గ్రాముల ప్యాకెట్ ధర ఇప్పుడు రూ.3 పెరిగింది. 560 గ్రాముల మ్యాగీ మసాలా నూడుల్స్ ప్యాకెట్ రూ. 105 అవుతుంది. అంటే.. ఇది మునుపటి రూ.96 కంటే ఎక్కువగా పెరిగింది. నెస్లే ఎ+మిల్క్ 1 లీటర్ కార్టన్ ధరను రూ.75 నుంచి రూ.78కి పెంచింది. నెస్కేఫ్, బ్రూ, తాజ్ మహల్ టీ, బ్రూక్ బాండ్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగానే పెరిగాయి.

CNG ధర :
ఢిల్లీ పరిసర నగరాల్లో CNG ధర మార్చిలో కిలోకు 0.50 రూపాయలు పెరిగింది. ఢిల్లీలోని ఎన్‌సిటిలో CNG ధర కిలో రూ.56.51 నుంచి రూ.57.51కి పెరిగింది.

Read Also : Zomato Delivery: పది నిముషాల్లో ఫుడ్ డెలివరీ? జొమాటోకు ఇది ఎలా సాధ్యం?

ట్రెండింగ్ వార్తలు