Ukraine Russia War : యుధ్ధం కారణంగా మండుతున్న వంట నూనెల ధరలు

యుక్రెయిన్‌, రష్యా యుద్ధం పుణ్యమా అని వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే ఆల్ టైం హైకి చేరాయి  వంట నూనెల ధరలు. రానున్న కాలంలో వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి

Ukraine Russia War : యుధ్ధం కారణంగా మండుతున్న వంట నూనెల ధరలు

Edible Oils Price Hike

Ukraine Russia War :  యుక్రెయిన్‌, రష్యా యుద్ధం పుణ్యమా అని వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే ఆల్ టైం హైకి చేరాయి  వంట నూనెల ధరలు. రానున్న కాలంలో వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. యుక్రెయిన్‌ నుంచి సప్లై నిలిచిపోవడం.. నల్లసముద్రంలో పోర్టుల మూతతో యూరప్‌ నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోవడంతో షార్టేజ్ పెరిగిపోయింది. ఇటు రష్యా సప్లై చేసే ఆయిల్‌ కోసం భారత్, చైనా నువ్వా.. నేనా.. అనేలా పోటీ నెలకొంది.

రష్యా, యుక్రెయిన్‌ వార్‌తో వంట నూనెలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచ  వ్యాప్తంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వాటాలో యుక్రెయిన్‌ టాప్‌లో ఉండడంతో.. ఇప్పుడు సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడింది. యుద్ధ ప్రభావం వల్ల యుక్రెయిన్‌ సప్లై చైన్‌ తెగిపోవడంతో ప్రపంచ దేశాల్లో వంట నూనెల కొరత తీవ్రమైంది. దీంతో పాటు రష్యా మీద ఉన్న ఆంక్షల కారణంగా.. ఎగుమతులు నిలిచిపోయాయి. రష్యాలో ఆయిల్‌ నిల్వలు పేరుకుపోవడంతో వాటిని అందుకునేందుకు భారత్, చైనా పోటీ పడుతున్నాయి.

రష్యా దండయాత్ర కారణంగా యుక్రెయిన్‌ రైతులు ఇప్పటికిప్పుడు వ్యవసాయం చేయలేరు. ఒకవేళ చేసినా.. గ్లోబల్ డిమాండ్‌ను తీర్చేంత వ్యవసాయం చేయడం దాదాపు అసంభవం. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ఎగుమతుల్లో యుక్రెయిన్ వాటా 23 శాతం కాగా.. రష్యాది 11 శాతం. వీటిలో ఎక్కువగా దిగుమతి చేసుకునేది భారత్, చైనా దేశాలే. యుక్రెయిన్‌ నుంచి వచ్చే 23 శాతం వాటా పూర్తిగా పడిపోవడంతో.. ఇప్పుడు ఈ రెండు దేశాలు రష్యాపైనే ఆధారపడ్డాయి.
Also Read : Abhishek Agarwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ త్వరలోనే తెలుగు డబ్బింగ్.. 10 టీవీతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పెషల్ ఇంటర్వ్యూ..
మరో వైపు రష్యాపై ఆంక్షల కారణంగా ఇతర దేశాలు   రష్యాతో వాణిజ్యానికి ముందుకు రాకపోతుండడంతో రష్యా నిల్వలను కొనేందుకు ఈ రెండు దేశాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దాదాపు నాలుగు వారాలుగా రష్యా దళాలు యుక్రెయిన్‌లోకి ప్రవేశించి యుద్ధం షురూ చేశాయి. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, కాల్పుల విరమణపై ఇంకా పురోగతి లేదు.

దీంతో యూరప్‌ ఎగుమతులకు గేట్‌వే అయిన ఒడెస్సా పోర్ట్ నుంచి గోధుమ, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వంట నూనెల ఎగుమమతులు నిలిచిపోయాయి. యుక్రెయిన్‌ వంటనూనెల ఎగుమతుల్లో భారతదేశం వాటా 28.1 శాతం కాగా, చైనా వాటా 18.3 శాతం. అటు రష్యా నుంచి కూడా భారత్, చైనా నూనెను దిగుమతి చేసుకుంటాయి. 2020లో రష్యా ఎగుమతి చేసిన 2.3 మిలియన్ టన్నులలో 1.19 మిలియన్ టన్నులు ఈ రెండు దేశాలే కొనుగోలు చేశాయి.
Also Read : KTR America Tour : తెలంగాణలో పెట్టుబడుల కోసం కేటీఆర్ అమెరికా టూర్
2020లో యుక్రెయిన్‌ నుంచి భారత్, చైనా మూడు మిలియన్ టన్నుల నూనెలను దిగుమతి చేసుకున్నాయి. వంట నూనెల దిగుమతుల్లో యుక్రెయిన్‌దే ప్రధాన వాటా కావడంతో.. ఇప్పుడు రష్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ఒత్తిడి పెరిగింది. రెండు దేశాల డిమాండ్‌కు సరిపడా సప్లై చేసే శక్తి రష్యాకు లేకపోవడంతో ముందు ముందు కొరత మరింత తీవ్రం కానుంది.