Home appliances: త్వరలో పెరగనున్న ఏసీ, ఫ్రిజ్ ధరలు.. ఎందుకంటే..?

త్వరలో ఏసీ, ఫ్రిజ్, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి వీటి ధరలు పెరుగుతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధలతో ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయాలంటే ...

Home appliances: త్వరలో పెరగనున్న ఏసీ, ఫ్రిజ్ ధరలు.. ఎందుకంటే..?

Home Appliances

Home appliances: త్వరలో ఏసీ, ఫ్రిజ్, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి వీటి ధరలు పెరుగుతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధలతో ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వేసవి కావడంతో పాటు ఈసారి ఎండలు మండిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికశాతం మంది తమ ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 3 నుంచి 5శాతం వరకు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Home Appliances : మధ్యతరగతి ప్రజలకు మరో షాక్..ప్రియం కానున్న గృహోపకరణాలు!

ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పతనం కావటమే కారణమని కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం డాలర్ విలువ పెరిగిపోవడంతో దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత మొత్తం చెల్లించాల్సి వస్తోందని, తద్వారా ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను త్వరలోనే 3-5శాతం పెంచాల్సి రావొచ్చని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదార్ల సంఘం సీమా అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా తెలిపారు. రూపాయి ధర పతకం కావడంతో డాలర్ ఇప్పటికే రూ. 77.40 కు చేరుకుంది. ఒకవేళ ప్రస్తుతం యూఎస్ డాలర్ మునుపటి స్థాయికి అంటే 75కి వచ్చే రెండు వారాల్లో చేరుకుంటే ధరలు పెంచే అవసరం ఉండదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు క్షీణించి 77.40 వద్ద ముగిసింది.

Twitter: ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందు.. ట్విటర్ నుంచి ఇద్దరు ఔట్..

చైనాలో కొవిడ్-19 కేసుల పెరుగుదల తరువాత ఆ దేశ రాజధానితో పాటు పలు నగరాల్లో లాక్ డౌన్ ఆంక్షలను అక్కడి ప్రభుత్వం కఠినతరం చేసింది. ఎలక్ట్రానిక్ కు సంబంధించిన విడిగాభాగాలు చైనాలోని షాంఘై పోర్ట్ లో కంటైనర్లను నిలిపివేయడం ద్వారా విడిభాగాల దిగుమతి తగ్గి కొరత ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ కంపెనీలపై ఈ ప్రభావం పడటం, రూపాయి విలువ పతనం కాడంతో ధరలు పెంచాల్సి వస్తుందని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే విషయంపై పానాసోనిక్ ఇండియా & సౌత్ ఏషియా సీఈఓ మనీష్ శర్మ మాట్లాడుతూ.. విడిభాగాల రవాణా తగ్గిపోవడంతోపాటు, వారి ధరలు పెరగడంతో కంపెనీలపై భారం పడుతుందని, అయినప్పటికీ వినియోగదారులపై ధరల భారం పడకుండా కంపెనీ కృషి చేస్తోందని తెలిపారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఇతర ఉపకరణాలపై త్వరలో 4-5 శాతం పెంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.