PM Modi : 70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

ప్రధాని మోదీ ట్విట్టర్ పాలోవర్స్ 70 మిలియన్ మార్క్ దాటారు. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. దేశ ప్రజలకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికగా మోదీ మంచి మెసెజ్సులు పంపుతుంటుంటారు. ఇవే ఆయన పాలోవర్స్ సంఖ్యను అమాంతం పెంచాయి.

PM Modi : 70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

Pm Modi (2)

PM Modi : ప్రధాని మోదీ ట్విట్టర్ పాలోవర్స్ 70 మిలియన్ మార్క్ దాటారు. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. దేశ ప్రజలకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికగా మోదీ మంచి సందేశాలు షేర్ చేస్తుంటారు. ప్రభుత్వ పరమైన విషయాలే కాకుండా ఇతర అంశాలను కూడా పోస్ట్ చేస్తుంటారు.

మోదీ ట్విట్టర్ ఖాతా గురించి తెలుసుకోవాలంటే.. 2009 గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోదీ ట్విట్టర్ ఖాతా తెరిచారు. 2010లో మోదీ ట్విట్టర్ ఖాతా లక్ష మంది పాలోవర్స్ ని సొంతం చేసుకుంది. 2011 నవంబర్ వచ్చేసరికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2014లో దేశ ప్రధాని అయిన తర్వాత సోషల్ మీడియాలో మోదీ పాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది.

ఏడేళ్ల కాలంలో ట్విట్టర్ పాలోవర్స్ సంఖ్య 6.9 మిలియన్లు పెరిగింది. ట్విట్టర్ పాలోవర్స్ లో మోదీ ప్రపంచంలో 11 స్థానంలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 129.8 పాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు.