5G Services Launch : 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 13 నగరాల్లో అందుబాటులోకి

2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెలికాం రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 5జీ సేవలను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు.

5G Services Launch : 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 13 నగరాల్లో అందుబాటులోకి

Pm Modi

5G Services Launch : ప్రధాని నరేంద్ర మోదీ దేశ టెలికాం రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 5జీ సేవలను శనివారం ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబర్ 1 నుంచి 4 తేదీ మధ్యలో జరిగే 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. ఆ వెంటనే 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు.

5G Network: 5జీ సేవలు ఏఏ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.. 5జీ‌ తో లాభాలేంటి? నష్టాలేంటి?

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, భారతదేశంలో అతిపెద్ద టెలికామ్ కంపెనీ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ నుంచి సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో రిలయన్స్ జియో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. జియో ట్రూ 5జీ సేవలు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారు. వైద్య రంగానికి జియో ట్రూ 5జీ సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆకాశ్ అంబానీ ప్రధాన మంత్రికి వివరించారు.

Women’s Asia cup: నేటి నుంచి మహిళల ఆసియాకప్‌ .. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా

5జీ సేవలు తొలి దశలో ఎంపిక చేసిన 13 నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. వాటిల్లో.. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాల్లో ఉన్నాయి. ఇందులో చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నాలుగు మెట్రోలకు ఈరోజు నుండి 5జీ సేవలు ప్రారంభమువుతున్నట్లు తెలుస్తుంది.

TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

5జీ సేవలను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో ఇది ఒక ప్రధాన అడుగు అని అన్నారు. 2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని అన్నారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దేశంగా ఉండడమే కాకుండా, వైర్‌లెస్ టెక్నాలజీ రూపకల్పనలో సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ప్రధానమైన, చురుకైన పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మొబైల్ ఫోన్‌ల తయారీలో భారతదేశం నంబర్ 2 స్థానంలో ఉందని, భారతదేశం కూడా మొబైల్ ఫోన్‌లను ఎగుమతి చేస్తోందని, ఈ ప్రయత్నాలన్నీ భారతదేశంలో మొబైల్ ఫోన్‌లను చౌకగా మార్చాయని ప్రధాని అన్నారు. ఒక బిచ్చగాడు కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వీడియోను తాను చూశానని ప్రధాని మోదీ అన్నారు. చిన్న వ్యాపారులు కూడా ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు ఎలా చేస్తున్నారో వివరిస్తూ “అతని పారదర్శకతను చూడండి” అని ప్రధాని మోదీ అన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు.