PM Modi : రాజస్థాన్‌‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ కారుపై ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ ఏడాదిలో మూడోసారి రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని రూ. 5,500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

PM Modi : రాజస్థాన్‌‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

Pm modi ..cm ashok gehlot

PM Modi : ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటిస్తున్నారు. ఈ సంవత్సరం రాజస్థాన్‌లో మూడవసారి పర్యటిస్తున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో పూజలు నిర్వహించిన ప్రధాని నాథ్‌ద్వారాలో రూ. 5,500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ కారుపై పూల వర్షం కురిపించారు ప్రజలు. అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేసిన సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ సభను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజల సమక్షంలో రాజస్థాన్ లో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రధానిని కోరారు. ఈ రోజు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంతకుముందు గుజరాత్‌తో పోటీ పడ్డాం.. వెనుకబడిపోయామని భావించేవాళ్లమని కానీ ఇప్పుడలా కాదు.. అభివృద్ది చెందాం అని అన్నారు. తమ ప్రభుత్వ సుపరిపాలన వల్ల రాజస్థాన్ ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నానని అన్నారు సీఎం గెహ్లాట్. మా రాష్ట్రం పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లకు సంబంధించి ప్రధానికి లేఖలు రాస్తూనే ఉన్నాను. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తన కృషి కొనసాగుతుందని అన్నారు.

కాగా రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. రాజస్థాన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి వచ్చినసందర్భంగా ప్రధాని కారుపై ప్రజలు పూల వర్షం కురిపించారు. ప్రధాని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3:15 గంటలకు అబు రోడ్‌లోని బ్రహ్మ కుమారీస్ శాంతివన్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. అనంతరం రాజ్‌సమంద్ ఉదయ్‌పూర్‌లలో రెండు రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మూడు జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

పలు అభివద్ధి పనుల్లో భాగంగా 114 కి.మీ పొడవు గల ఆరు లేన్ల ఉదయపూర్ నుండి NH-48లోని షామ్లాజీ సెక్షన్,110 కి.మీ. పొడవుగల NH- 25 యొక్క బార్- బిలారా-జోధ్‌పూర్ సెక్షన్, 47 కి.మీ పొడవు గల రెండు లేన్ల NH 58E ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఊతం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ బ్రహ్మ కుమారీల శాంతివన్ కాంప్లెక్స్‌ను సందర్శించనున్నారు. సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శివమణి వృద్ధాశ్రమం యొక్క రెండవ దశ, నర్సింగ్ కళాశాల విస్తరణ, అబూ రోడ్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను అందించనున్న సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ హాస్పిటల్ ఏర్పాటు వంటి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయాన్ని దర్శించిన ప్రధానిని అధికారులు ఘనంగా సత్కరించారు.