PM Modi నేడు పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను వినూత్నంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ ఇవాళ వినూత్నంగా నిర్వహించనున్నారు.

PM Modi నేడు పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను వినూత్నంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Purvanchal Expressway

Purvanchal Expressway in UP : ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ ఇవాళ వినూత్నంగా నిర్వహించనున్నారు. భారత వాయుసేనకు చెందిన సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానంలో ఈ రహదారిపై దిగి కార్యక్రమాన్ని చేపడతారు. ఈ సందర్భంగా నిర్వహించే వైమానిక విన్యాసాలకు, ల్యాండింగ్‌ కసరత్తుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇందులో భాగంగా ఏఎన్‌-32 విమానం, ఫైటర్‌ జెట్‌లు సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000లు ఆదివారం ఈ మార్గంపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు.  ప్రధాన మంత్రిని తీసుకొచ్చే సీ-130జే కూడా సుల్తాన్‌పుర్‌ జిల్లాలో సిమెంటుతో వేసిన ఎయిర్‌ స్ట్రిప్‌లో దిగింది. 3వందల 40 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో కొన్ని సెక్షన్లను అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగడానికి, టేకాఫ్‌ కావడానికి వీలుగా తీర్చిదిద్దారు.

MPTC, ZPTC Elections : ఏపీలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మోదీ సుల్తాన్‌పుర్‌ జిల్లాలోని కర్వాల్‌ ఖేరి వద్ద దిగుతారు. అనంతరం ఆయన ఓ బహిరంగ సభలో పాల్గొనడానికి వెళతారు. తిరిగొచ్చి.. మిరాజ్‌-2000, ఏఎన్‌-32 విమానాల ల్యాండింగ్‌ను వీక్షిస్తారు. ఏఎన్‌-32లో బలగాలు కూడా దిగుతాయి.

అనంతరం ఆకాశంలో వైమానిక విన్యాసాలు జరుగుతాయి. ఇందులో మూడు కిరణ్‌ మార్క్‌-2 విమానాలు, రెండు సుఖోయ్‌-30 ఎంకేఐ జెట్‌లు పాల్గొంటాయి. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు రహదారులపై దిగడం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభమైంది. తొలుత జర్మనీలో అలాంటి విన్యాసం జరిగింది.