Modi US Tour : ప్రధాని మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

ప్రధాని మోడీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు మూడ్రోజులపాటు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు.

Modi US Tour : ప్రధాని మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

Modi (2)

Modi’s US tour schedule : ప్రధాని మోడీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు మూడ్రోజులపాటు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. 2019 తర్వాత తొలిసారి అమెరికా వెళ్తున్న ప్రధాని.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ మీటింగులతో బిజీబిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ రేపు వాషింగ్టన్ చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు అంటే 23న ఉదయం అక్కడి ప్రముఖ సంస్థలకు చెందిన సీఈవోలతో సమావేశం అవుతారు.

ఐదుగురు టాప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌తో ముఖాముఖి సమావేశం కానున్నారు. అందులో ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్ కూడా ఉండే అవకాశం ఉంది. మిగతా నలుగురు ఎవరన్నది ఇంకా ఫైనల్‌ కావాల్సి ఉంది. అదేరోజు అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారిస్‌తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌, జపనీస్ ప్రధాని యోషియిడే సుగాతోను సమావేశం కానున్నారు.

Vaccination Record: మోడీ పుట్టినరోజు నాడే దేశంలో వ్యాక్సినేషన్ రికార్డ్..

24న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక.. అదేరోజు బైడెన్‌ నేతృత్వంలో వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోనూ మోడీ పాల్గొంటారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌, జపనీస్ ప్రధాని యోషియిడే సుగా కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సులో అఫ్ఘానిస్తాన్ పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ అజెండా, కోవిడ్‌-19, వాతావరణ మార్పులు వంటి అంశాలు చర్చకు రావచ్చు. అదేరోజు బైడెన్‌ ఇచ్చే డిన్నర్‌కు హాజరై.. ఆ తర్వాత న్యూయార్క్‌కు బయల్దేరి వెళతారు.

ఇక పర్యటనలో చివరిరోజు అయిన ఈనెల 25న.. న్యూయార్క్ లో జరిగే 76వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. కరోనా, ఉగ్రవాదం అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలపై మనదేశ వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపైనా చర్చించే అవకాశం ఉంది. UNలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి కూడా మోడీ ప్రస్తావించనున్నారు.

Evergrande Crisis : చైనాలో ‘ఎవర్‌గ్రాండ్‌’ సంక్షోభం..! ప్రపంచ మార్కెట్లలో ఆందోళన

మొత్తంగా బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక తొలిసారి మోడీ అక్కడ అడుగుపెట్టనుండటంతో ఈ టూర్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈనెల 25తోనే మోడీ అధికారిక పర్యటన ముగిసినా.. ఈనెల 27న భారత్‌కు తిరిగి రానున్నారు.