కాంగ్రెస్ అంటే అవినీతి,అస్థిరత,అబద్దాలు..అసోం ఎన్నికల ప్రచారంలో మోడీ

అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరును పెంచారు ప్రధాని మోడీ​. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని,అసోం అభ్యున్నతకి ఒక విజన్ కానీ, సిద్ధాంతం కానీ ఆ పార్టీకి లేవని ప్రధాని ఆరోపించారు.

కాంగ్రెస్ అంటే అవినీతి,అస్థిరత,అబద్దాలు..అసోం ఎన్నికల ప్రచారంలో మోడీ

Prime Minister Narendra Modi Addresses Rally In Bokakhat Assam

Prime Minister అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరును పెంచారు ప్రధాని మోడీ​. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని,అసోం అభ్యున్నతకి ఒక విజన్ కానీ, సిద్ధాంతం కానీ ఆ పార్టీకి లేవని ప్రధాని ఆరోపించారు.

ఆదివారం(మార్చి-21,2021)ఘోలాఘట్ జిల్లాలోని బోకాఖాట్‌ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. అసోం ప్రజలకు కాంగ్రెస్ 5 హామీలు ఇచ్చిందని, నిజానికి బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ ఏకైక మంత్రమని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 5 హామీలను నమ్మవద్దని ప్రధాని సూచించారు. అవన్నీ తప్పుడు వాగ్దానాలని అన్నారు. కాంగ్రెస్‌ తమ పాలనలో అసోంని దోచుకుందని ఆరోపించారు. సుదీర్ఘ కాలం అసోంను పాలించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే అర్ధం.. అబద్ధాలు, గందరగోళం, అస్థిరత, హింస, అవినీతి అని ఆరోపించారు.

ఏళ్ల తరబడి అసోంలో సాగిన హింసకు ఎన్డీఏ ప్రభుత్వం తెరదించి శాంతి, సుస్థిరత తీసుకువచ్చిందని వెల్లడించారు. అయిదేళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనా కాలంలో దోపిడీ నుంచి అసోంను ఎలా కాపాడాలి అనే ప్రశ్న ఉండేది. ప్రతి అసోం వాసి నుంచి ఈ ప్రశ్న వస్తూ ఉండేది. ఎన్డీఏ పాలనలో అసోం ప్రస్తుతం కొత్త శిఖరాలను అందుకునేందుకు పూర్తి బలంతో ముందుకు సాగుతోంది. బ్రహ్మపుత్ర నది రెండు తీరాల మధ్య అనుసంధానం ఎలా చేయాలి అని కాంగ్రెస్‌ పాలనలో ప్రశ్న ఉండేది. ఎన్డీఏ పాలనలో బ్రహ్మపుత్ర నది మీద ఆధునిక వంతెన నిర్మాణం జరుగుతోంది. ఆగిపోయిన పాత వంతెనల నిర్మాణాలను పూర్తి చేస్తున్నాం. అసోంలో రెండో సారి భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని నిశ్చయమైపోయింది అని ప్రధాని మోడీ తెలిపారు.

కాజీరంగా పార్కులో ప్రపంచ ప్రఖ్యాత ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను కాంగ్రెస్ కాపాడలేకపోయేదని, బీజేపీ పాలనలో.. కొమ్ముల కోసం ఖడ్గమృగాలు వేటకు గురికాకుండా కాపాడి, వేటగాళ్లను జైలుకు పంపామని మోడీ తెలిపారు. అసోం సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఉత్సవాలు దేశానికి గర్వకారణమని అన్నారు. బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడటానికి తమ పార్టీ కష్టించి పనిచేస్తుందని తాను భరోసా ఇస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో అసోంలో అటవీ ప్రాంతం విస్తరించామని, ఒక్క చమురు, గ్యాస్ రంగంలో రూ.40,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, అసోం దర్శన్ పేరుతో 9,000 నామ్‌గర్‌లు, ఇతర మత సంస్థల్లో మౌలిక వసతులు కల్పించామని ప్రధాని చెప్పారు. టీ కార్మికులను ఏళ్ల తరబడి కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, తాము టీ వర్కర్ల విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాము వాగ్దానం చేసిన రూ.351 రూపాయల రోజువారీ వేతనం ఇవ్వలేక పోవడంపై టీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారని, మరోసారి తమకు అధికారం ఇస్తే టీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఇక,126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మార్చి-27నుంచి ఏప్రిల్-6వరకు మూడు విడతలుగా పోలింగ్ జరుగనుంది. ఫలితాలు మే 2న వెలువడుతాయి.