పేలుళ్లను ఖండించిన మోడీ : శ్రీలంకకు అండగా ఉంటాం

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 08:42 AM IST
పేలుళ్లను ఖండించిన మోడీ : శ్రీలంకకు అండగా ఉంటాం

ఢిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్.. శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఆదివారం (ఏప్రిల్ 21)ఉదయం మూడు చర్చిలు, మూడు హోటళ్లను వరుస పేలుళ్లు కుదిపేశాయి. ఈ ఘోరం ఘటనల్లో లో మృతుల సంఖ్య 185కి చేరింది. గాయపడిన వందలాదిమందిని అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. 
 కాగా కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే. హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్స్‌లోనూ పేలుళ్ల చోటుచేసుకున్నాయి. ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే.