ప్రపంచంలోనే అధునాతన ఆయుధం : అమేథీలో మేడిన్ ఏకే-203

రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత గగనతలంలో ఎగురుతాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో పర్యటించిన ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.538 కోట్లతో 17 ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రపంచంలోనే అధునాతన ఏకే-203 అధునాతన ఆయుధాల తయారీ కర్మాగారానికి మోడీ శంకుస్థాపన చేశారు. రష్యా సాయంతో రైఫిల్స్ ను తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…మన దళాలు.. అమేథీలో తయారైన రైఫిల్స్ ను వినియోగించనున్నాయి. ఈ పనులు 9 ఏళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించలేదు. మేడ్ ఇన్ అమేథీ నినాదాన్ని మేము నిజం చేశాము. రష్యా కంపెనీ ఇందులో భాగస్వామ్యం పంచుకునేందుకు సహకరించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను.
కొంత మంది ప్రపంచంలో తిరుగుతూ చెబుతుంటారు..ఇది ఉజ్జయినిలో తయారైందని,జైపూర్ లో తయారైందని, జైస్మలేర్ లో తయారైందంటూ మాటలు చెబుతుంటారు. కానీ వాళ్ల భాష అలాగే ఉండిపోతుంది. ఇక్కడ మోడీ ఉన్నాడు. అమేథీలో ఏకే-203 రైఫిల్ వచ్చింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన వారి కంటే భాజపా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే ఈ ప్రాంతం కోసం ఎక్కువగా పనిచేశారు. మహిళా సాధికారత అంటే ఏంటో ఇప్పుడు భారత్ ప్రపంచానికి చూపుతోంది. మేం ఇక్కడ ఓడిపోవచ్చు కానీ ప్రజల హృదయాలను గెల్చుకున్నట్లు తెలిపారు.రఫేల్ ఒప్పందం వల్ల తమకు లాభం చేకూరకుండా పోవడంతోనే కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. మోడీతో పాటు సీఎం యోగి ఆధిత్యనాధ్,కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ,నిర్మలాసీతారమన్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
PM Modi: Kuch log duniya mein ghomte-ghoomte batate hain ‘Made in Ujjain’, ‘Made in Jaipur’, Made in Jaisalmer’…bhashan karte hain. Unke bhashan hi reh jate hain. Yeh Modi hai, ab ‘Made in Amethi’ AK-203 rifle hogi. pic.twitter.com/UhxSJBgfOY
— ANI UP (@ANINewsUP) March 3, 2019
PM Modi in Amethi: One of the most advanced rifles in world AK-203 will be made in Amethi. It will be made by a joint-venture of India & Russia. I express my gratitude to my friend President Vladimir Putin, this venture was made possible in such a short time by his support. pic.twitter.com/D2MhSrGTCr
— ANI UP (@ANINewsUP) March 3, 2019