103ఏళ్ల బామ్మకు “నారీ శక్తి” పురస్కారం…ఆశీస్సులు తీసుకున్న మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2020 / 12:14 PM IST
103ఏళ్ల బామ్మకు “నారీ శక్తి” పురస్కారం…ఆశీస్సులు తీసుకున్న మోడీ

ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన 103 ఏళ్ల మన్‌ కౌర్‌ కు నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌  ప్రదానం చేశారు. 

న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మన్‌ కౌర్‌తోపాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తొలి మహిళా ఫైటర్‌ పైలట్స్‌ మోహన జితర్వాల్‌, అవని చతుర్వేది, భావన కాంత్‌, బీహార్‌కు చెందిన బినా దేవికి నారీ శక్తి పురస్కారాలని అందజేశారు. మశ్రూమ్‌ (పుట్టగొడుగుల పెంపకం) సాగుతో మశ్రూమ్‌ మహిళగా పేరుపొందారు బినాదేవి. బీహార్‌లోని ఢౌరీ పంచాయత్‌ సర్పంచ్‌గా ఐదేళ్లపాటు ఆమె సేవలందించారు. పురస్కారాల ప్రదానం  సమయంలో రాష్ట్రపతి వెంట ఆయన భార్యతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్,స్మృతీ ఇరానీలు కూడా ఉన్నారు. 

పురస్కారాల ప్రదానం అనంతరం నారీ శక్తి పురస్కార గ్రహీతలతో ప్రధాని మోడీ ఇంటారాక్ట్ అయ్యారు. వారితో మోడీ మాట్లాడుతూ…మీరు మీ పనిని ప్రారంభించినప్పుడు, మీరు దాన్ని ఒక మిషన్‌గా చేసి ఉండాలి లేదా జీవితంలో విలువైనది చేయవలసి ఉంటుంది లేదా ప్రవాహంతోనే అయి ఉండవచ్చు. ఇది బహుమతి కోసం కాకపోవచ్చు కాని ఈ రోజు మీరు ఇతరులకు ప్రేరణగా నిలిచారు. నరేంద్ర మోడీతో జరిగిన సంభాషణలో కాశ్మీర్‌కు చెందిన అరిఫా తన విజయ కథను పంచుకుంది. సాధారణంగా ఎంటర్ ప్రెన్యూవర్స్ కి అట్టడుగు నుండి ప్రశంసలు పొందడం కష్టమని అరిఫా తెలిపింది.

ఈ సందర్భంగా అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూర్తిగా నిలిచి  నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్న 103 ఏళ్ల మన్‌ కౌర్‌ ఆశిస్సులు తీసుకున్నారు ప్రధాని మోడీ. ‘నారి శక్తి పురస్కర్’ అవార్డు గ్రహీత భూదేవి (ఆమె గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు వ్యవస్థాపకత పెంపొందించడానికి సహాయపడుతుంది) తో మోడీ సంభాషిస్తూ…. మీ కృషికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రభుత్వం రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పిఓ) కోసం చాలా పెద్ద మిషన్‌ను చేపట్టింది, మీరు దాని ప్రయోజనాలను పొందాలి అని అన్నారు.