Narendra Modi: వైఎస్ జగన్, స్టాలిన్‌లతో పాటు 11రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం

కరోనా వైరస్ గురించి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాత, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ఉదయం 11 గంటలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Narendra Modi: వైఎస్ జగన్, స్టాలిన్‌లతో పాటు 11రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం

Narendra Modi

Prime Minister Narendra Modi : కరోనా వైరస్ గురించి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాత, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ఉదయం 11 గంటలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది.

కరోనాపై ఈశాన్య ముఖ్యమంత్రులకు ప్రధాని ఇచ్చిన సలహా:
మోదీ ఈరోజు(13 జులై 2021) కరోనా మూడవ వేవ్‌ని దృష్టిలో ఉంచుకుని కరోనా ప్రమాదాన్ని వివరించేందుకు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా మునుపటి కంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. మైక్రోకంటైన్మెంట్ జోన్లను సృష్టించాలని, మూడవ వేవ్‌లో వచ్చే వైరస్ వేరియంట్ చాలా ప్రమాదంగా ఉండవచ్చునని హెచ్చరించారు.

కులు, మనాలీ, ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతుండగా.. ప‌ర్యాట‌కులు క‌రోనా నిబంధ‌న‌ల‌ను స‌రిగా పాటించట్లేదని, హిల్ స్టేష‌న్స్‌లో, మార్కెట్‌ల‌లో ఫేస్ మాస్కులు లేకుండా జ‌నం భారీ సంఖ్య‌లో తిరగడం ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యమ‌ని అన్నారు. రాబోయే మూడో వేవ్ ప్రమాదం ప్రజలకు వివరించి అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని కోరారు.

కరోనా వైరస్ ప్రతి వేరియంట్‌పై నిఘా ఉంచాల్సి ఉందని ప్రధాని మోదీ అన్నారు. మ్యుటేషన్ తర్వాత ఇది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో నిపుణులు నిరంతరం అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా సకండ్ వేవ్ ప్రమాదమే తగ్గలేదు. ఈ క్రమంలో మోదీ ఏం చెప్పబోతున్నారు అనేదానిపై ప్రాధాన్యత సంతరించుకుంది.